ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!

  • May 17, 2022 / 03:53 PM IST

స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒక్కటి మాత్రమే వస్తుంది. చిన్న హీరోల సినిమాలు నెలకొకటి చొప్పున వస్తాయి. పెద్ద హీరోల సినిమాలు గ్యాప్ తీసుకుని వచ్చినా.. హిట్ అవుతాయి అనే గ్యారెంటీ తక్కువ. ఒకవేళ హిట్ అయితే భారీగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక చిన్న హీరోల సినిమాలు నెలకి ఒకటి చొప్పున రిలీజ్ అయినా.. హిట్ అయితే తప్ప జనాలు థియేటర్లకు వెళ్ళి వాళ్ళ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే వీళ్ళ మధ్య మిడ్ రేంజ్ హీరోలు ఉంటారు. వీళ్ళని టైర్2 హీరోలు అంటారు. వీళ్ళ సినిమాలు కనుక పెద్ద హిట్ అయితే పెద్ద సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా కలెక్షన్లను రాబడుతుంటాయి. ఒకవేళ ఆ స్థాయిలో లేకపోతే వీళ్ళ మార్కెట్ కు తగ్గట్టు రాబట్టుకుంటాయి.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకి దర్శకులను చూపించే బాధ్యత కూడా వీళ్ళే చూపించినట్టు అయ్యింది. వీళ్ళతో ఏ దర్శకుడైనా సినిమా తీసి హిట్టు కొట్టినా పెద్ద హిట్టు కొట్టినా.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కుతుంటుంది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే చిరంజీవితో దర్శకుడు వెంకీ కుడుముల ఓ సినిమా చేయబోతున్నాడు. ఇతను నితిన్ తో ‘భీష్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మూవీని తెరకెక్కించిన పరశురామ్, ప్రభాస్ తో ‘ప్రాజెక్టు కె’ ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్, పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ ను తెరకెక్కించిన వేణు శ్రీరామ్… వీళ్లంతా మిడ్ రేంజ్ హీరోలతో హిట్లు కొట్టి.. అవకాశాలు దక్కించుకున్న వాళ్ళే. మిడ్ రేంజ్ హీరోల వల్ల రెండు రకాలుగా ఉపయోగం ఉంటుందని వీళ్ళ ద్వారా ప్రూవ్ అయ్యింది. సరే ఇంతకీ టాలీవుడ్లో ఉన్న టాప్10 మిడ్ రేంజ్ హీరోలు మరియు వాళ్ళ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయ్ దేవరకొండ :

ఇతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.70.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

2) వైష్ణవ్ తేజ్ :

‘ఉప్పెన’ మూవీ వైష్ణవ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.అతను తీసినవి రెండు సినిమాలే అయినా మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ కొట్టేసాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.51.52 కోట్ల షేర్ ను రాబట్టింది.

3) వరుణ్ తేజ్ :

ఇతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ‘ఎఫ్2’ ని చెప్పుకోవాలి. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.81 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ మూవీలో వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి..సోలో హీరోగా ‘ఫిదా’ ని బిగ్గెస్ట్ హిట్ అనాలి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.47.74 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) నితిన్ :

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ చేసిన ‘అఆ’ చిత్రం ఇతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.47.44 కోట్ల షేర్ ను రాబట్టింది.

5) నాగ చైతన్య :

నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలుగా ‘బంగార్రాజు'(రూ.40 కోట్లు షేర్) ‘మనం'(39-40 కోట్లు షేర్) ‘వెంకీ మామ'(రూ.38 కోట్ల షేర్) నిలిచాయి. అయితే సోలో హీరోగా ‘మజిలీ’ రూ.34.60 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) నాని :

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా ‘ఎం.సి.ఎ’ నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.39.84 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) రామ్ :

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.35.55 కోట్ల షేర్ ను రాబట్టింది. రామ్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే..!

8) సాయి ధరమ్ తేజ్ :

మారుతీ దర్శకత్వంలో చేసిన ‘ప్రతీరోజూ పండగే’ మూవీ తేజు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.34.08 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) శర్వానంద్ :

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేసిన ‘శతమానం భవతి’ శర్వా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) రానా :

దగ్గుబాటి రానా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ఘాజీ’ అతని కెరీర్ హైయెస్ట్. ‘భీమ్లా నాయక్’ ను వేసుకోలేం కాబట్టి.. ‘ఘాజీ’ బాక్సాఫీస్ వద్ద రూ.27 కోట్ల షేర్ ను రాబట్టింది.

11) అఖిల్ :

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.23.75 కోట్ల షేర్ ను రాబట్టింది.

12) గోపీచంద్ :

గోపీచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ‘లౌక్యం’ చిత్రాన్ని చెప్పుకోవాలి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.23 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus