ఆసక్తి కలిగిస్తున్న నాని కొత్త సినిమా పేరు!

  • October 22, 2017 / 10:21 AM IST

నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ ని క్రాస్ చేశారు. అదే ఉత్సాహంతో చక చకా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ దీపావళి రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. డిసెంబర్ లో ఈ మూవీ థియేటర్లోకి రానుంది. వెంటనే యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” మొదలు పెట్టనున్నారు. ఇందులో నాని డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఆ తర్వాత హను రాఘవపుడి, కిశోర్ తిరుమలతో సినిమాలు చేయనున్నారు. అయితే వీటిలో కిశోర్ తిరుమలతో చేసే సినిమాకి టైటిల్ ఖరారు అయింది. ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

ఈ పేరు అందరికీ పరిచయం. ఈ పేరు చెప్పగానే దూరదర్శన్ లో పాటల కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఇలా టైటిల్ తోనే నాని అందరినీ ఆకర్షించారు. సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇది కూడా పాతికేళ్ళనాడు మొదలయ్యే కథగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus