వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా తప్పని సరి అని చెప్పడంలో సందేహమే లేదు. అది హీరో అయినా.. హీరోయినయినా..! అయితే ఈ రెండు ఉన్నా… ఒక్కోసారి అదృష్టం కూడా ‘కీ రోల్’ పోషిస్తుంటుంది. ఇది మాత్రం ఎక్కువగా హీరోయిన్ల విషయంలోనే గమనించవచ్చు. ఈ కోవలోకే వస్తుంది నటి ఐశ్వర్య రాజేష్. ఈమె అదృష్టం చూస్తే మిగిలిన హీరోయిన్లందరూ అసూయ పడతారనడంలో అతిశయోక్తి లేదు. ఒకటి కాదు.. రేండు కాదు.. ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 11 సినిమాలున్నాయి.

అవును.. నిజంగా ఈమె 12 సినిమాలకు సైన్ చేసింది. ఇందులో నాలుగు తమిళ చిత్రాలు… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక మరో నాలుగు చిత్రాలను ఈమధ్యే అధికారికంగా ప్రకటించారు. ఇక తెలుగులో ఐశ్వర్య రాజేష్ ‘మిస్ మ్యాచ్’ ‘కౌసల్య కృష్ణ మూర్తి’ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అంతేకాదు యూనివెర్సల్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ‘భారతీయుడు 2’ లో కూడా ఓ హీరోయిన్ గా కనిపించబోతుంది ఐశ్వర్య. ఓ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు వరుసగా హీరోయిన్ అవకాశాలు దక్కించుకుని దూసుకుపోవడమంటే ఆషా మాషీ విషయం కాదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus