తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అయితే అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన మార్కెట్ తో పాటు బలమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ముఖ్యంగా అజిత్ కు అయితే తమిళ యువతలో మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి. ఎలాంటి సినిమా విడుదల చేసిన కూడా ఈజీగా 150 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అజిత్ తెలుగులో కూడా తన మార్కెట్ను పెంచుకోవాలి అని చూస్తున్నాడు.
ఇటీవల విడుదలైన వాలిమై సినిమా తెలుగులో పెట్టిన పెట్టుబడి మాత్రం నష్టాలను రప్పించలేదు. వాలిమై సినిమా తెలుగులో రెండు కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. బయ్యర్లకు అయితే పెట్టిన పెట్టుబడికి కొన్ని లాభాలను అందించింది. ఇక తెలుగులో కూడా మరింత బలాన్ని పెంచుకోవాలి అని అజిత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన తదుపరి సినిమాను యువ దర్శకుడు హెచ్ వినోథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆ సినిమా కు సంబంధించిన లుక్ కూడా రెడీ అయింది.
ఇటీవల అజిత్ తన కొడుకు పుట్టినరోజు వేడుకలలో ఆ లుక్ తోనే కనిపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. అయితే ఆ సినిమాలో ఒక బలమైన బ్యాంక్ ఆఫీసర్ కనిపించబోతున్న అజిత్ నెగటివ్ షెడ్ లో కూడా ఆశ్చర్య పరుస్తాడు అని తెలుస్తోంది. అయితే వాలిమై సినిమాలో కార్తికేయను విలన్ గా చూపించి తెలుగు ఎలాగైనా హైప్ క్రియేట్ చేశారో మరోసారి అదే తరహాలో వినోథ్ దర్శకత్వంలో చేయబోయే మరో సినిమా కోసం కూడా అజిత్ తెలుగు స్టార్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలుగు లో ఒక ప్రముఖ హీరో అజిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అతనిని నెగిటివ్ గా చూపిస్తారా లేదంటే పాజిటివ్ పాత్రలోనే చూపిస్తారా అనేది ఇంకా తెలియరాలేదు. ఇక దర్శకుడు బ్త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అని చూస్తున్నాడు. మరి ఆ సినిమాతో అజిత్ తెలుగు లో ఎంతవరకు మార్కెట్ పెంచుకుంటాడో చూడాలి.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!