అజిత్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్..!
- September 14, 2017 / 03:08 PM ISTByFilmy Focus
“వీరం, వేదాలమ్, వివేగం” చిత్రాలతో టాక్-రివ్యూలతో సంబంధం లేకుండా సూపర్ హిట్లు కొట్టిన అజిత్ అండ్ శివ గ్యాంగ్ త్వరలోనే మరోమారు కలిసి పనిచేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ అయిన శివకి కథ-కథనాలపై కంటే హీరో ఎలివేషన్ షాట్స్ మరియు మాస్ ఎలిమెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే శివకి వరుస విజయాలు దక్కడంతోపాటు.. అజిత్ కి శివ మేకింగ్ స్టైల్ నచ్చడంతో ముచ్చటగా మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమా కూడా చేసే అవకాశం ఇచ్చాడు.
మొదటి రెండు సినిమాలు ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో చిత్రీకరించిన శివ మూడో సినిమాను మాత్రం హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి మంచి పేరు దక్కించుకొన్నాడు. ఇప్పుడు ఆ పేరును కంటిన్యూ చేస్తూ.. నాలుగో సినిమాలో అజిత్ ను ఆస్ట్రోనాట్ గా చూపించనున్నాడట. స్పేస్ థ్రిల్లర్ గా తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని వినికిడి. మూడో సినిమా మిలటరీ నేపధ్యం, నాలుగో సినిమా స్పేస్ నేపధ్యంలో తెరకెక్కించనున్న శివ.. ఒకవేళ అజిత్ అయిదో సినిమా అవకాశం కూడా ఇస్తే ఇంకే జోనర్ సినిమా తీస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















