Akash Puri: పెద్ద తెరపై ఆ రొమాన్స్‌ చూడలేమా

Advertisement

హెడ్డింగ్‌ చూసి… ఏంటీ పూరి జగన్నాథ్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందా? పూరి సినిమా అంటే ‘లైగర్‌’ కదా అనుకోవచ్చు. అయితే వస్తోంది జూనియర్‌ పూరి సినిమా. ఆఁ.. అవును ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్‌’ను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే టాక్‌ నడుస్తోంది. ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘రొమాంటిక్‌’ ఓటీటీకి ఇచ్చేస్తారట అనే టాక్‌ సారాంశం. అయితే ఇందులో ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలి.

అనిల్‌ పాడూరి దర్శకత్వంలో రూపొందిన ‘రొమాంటిక్‌’ గతేడాదే విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తీరా కరోనా తొలి వేవ్‌ వెళ్లిపోయింది అనుకొని సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. అయితే ఈలోగా కరోనా యూ టర్న్‌ తీసుకొని సెకండ్‌ వేవ్‌ రూపంలో వచ్చేసింది. దీంతో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈసారి ఇంకా ఆగే ఉద్దేశంలో చిత్రబృందం లేదని తెలుస్తోంది. ఓటీటీకి వచ్చేస్తుందట.

నిజానికి గతేడాదే సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చిత్రబృందం ఖండించి, థియేటర్లలోనే విడుదల చేస్తాం అని ప్రకటించింది. అనుకున్నట్లుగా సినిమాను ఓటీటీకి ఇవ్వకుండా ఆపారు. అయితే ఇప్పుడు మాత్రం అలా ఆగడం లేదట. ఈసారి ‘రొమాంటిక్‌’ ఓటీటీకి రావడం పక్కా అంటున్నారు. ఈసారి ఆఫర్‌ నెట్‌ఫ్లిక్స్‌ నుండి వచ్చిందట. మరి ఈసారి ‘రొమాంటిక్‌’ టీమ్‌ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు సమాచారం అయితే ఓటీటీకి జై కొట్టినట్టే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus