పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి కూడా హీరోగా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మేన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో స్టార్ హీరోల చిన్నప్పటి రోల్స్ చేసిన ఆకాశ్ తరువాత హీరోగా మారి ‘ఆంధ్రాపోరి’ ‘మెహబూబా’ వంటి చిత్రాలు చేసాడు. ‘మెహబూబా’ తన తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయగా… ఈ చిత్రంలో ఆకాశ్ నటన అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి.
సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఆకాశ్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు. నిర్మాత ఛార్మీ కి కూడా నష్టం వాటిల్లింది. అయితే గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో లాభాలు బాట పట్టారు. ఇక మరోసారి ఆకాశ్ తో ‘రొమాంటిక్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూరి అండ్ ఛార్మీ. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడు. రమ్య కృష్ణ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది అని సమాచారం.
ఆమెతో పాటు ‘సాహో’ చిత్రం కల్కి పాత్ర చేసిన మందిరా బేడీ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది అని తెలుస్తుంది.ఇక దర్శకుడు కూడా పూరి శిష్యుడేనట. తన ప్రతీ సినిమాల్లో పూరి ఓ డిఫరెంట్ ఎండింగ్ ఇస్తుంతాడు. ఈ చిత్రంలో కూడా అలాంటి ఎండింగ్ ఉండబోతుంది అని సమాచారం. ఎండింగ్ లో హీరో, హీరోయిన్ ల మధ్య ఓ ఘాటు లిప్ లాక్ ఉంటుందట. ఆ సీన్ తోనే సినిమా ఎండ్ అవుతుంది అని తెలుస్తుంది.