ఆకతాయి అమ్మడికి అదిరిపోయే ఆఫర్…

  • August 9, 2017 / 01:51 PM IST

“ఆకతాయి” అనే సినిమా విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలిసి ఉండదు, ఇక అందులో నటించిన నటీనటుల గురించి ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముంబై మోడల్ రుక్సర్ మీర్ గురించి ఎవరికీ తెలీదు. అయితే.. ఎవరూ గుర్తించని రుక్సర్ ను నేచురల్ స్టార్ నానీ మాత్రం భలే గుర్తుపట్టాడు.

విషయం ఏంటంటే.. నానీ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కృష్ణార్జున యుద్ధం” సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా రుక్సర్ మీర్ ఎంపికైంది. అమ్మడికి ఇది నిజంగా బంపర్ ఆఫరే. మరి ఈ ఆఫర్ ను ఆకతాయి అమ్మడు ఏ స్థాయిలో ప్రూవ్ చేసుకొంటుందో.. సదరు సినిమా ద్వారా ఇంకెన్ని సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుందో చూడాలి!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus