నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన `అఖండ` చిత్రం 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2వ వీకెండ్ ను కూడా భారీగా క్యాష్ చేసుకుంది.
ఇక ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
17.40 cr
సీడెడ్
13.25 cr
ఉత్తరాంధ్ర
5.45 cr
ఈస్ట్
3.58 cr
వెస్ట్
2.97 cr
గుంటూరు
4.16 cr
కృష్ణా
3.20 cr
నెల్లూరు
2.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
52.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
9.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
61.86 cr
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 11 రోజులకి గాను రూ.61.86 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.7.86 కోట్ల లాభాలు దక్కాయి.అయితే ఉత్తరాంధ్ర మరో 0.35 కోట్లు, ఈస్ట్ : 0.37కోట్లు, వెస్ట్ : 0.47 కోట్లు, గుంటూరు : 1.32 కోట్లు, కృష్ణా :0.62 కోట్లు వంటి ఏరియాల్లో ఇంకా టార్గెట్లు రీచ్ అవ్వలేదు. ఈ గురువారం లోపు మాత్రమే టైం ఉంది. లేదంటే కష్టమే. ఎందుకంటే ఈ శుక్రవారం నుండీ ‘పుష్ప’ థియేటర్లకు రానుంది. ఆ సినిమా పై భారీ హైప్ ఉంది.