నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ‘సింహా’ ‘లెజెండ్’ కాంబో కావడం పైగా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నమోదయ్యాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 11.00 cr |
సీడెడ్ | 11.00 cr |
ఉత్తరాంధ్ర | 5.80 cr |
ఈస్ట్ | 3.95 cr |
వెస్ట్ | 3.44 cr |
గుంటూరు | 5.48 cr |
కృష్ణా | 3.82 cr |
నెల్లూరు | 1.89 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 46.38 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.40 cr |
ఓవర్సీస్ | 2.47 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 53.25 cr |
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ బిజినెస్ జరిగింది ఈ చిత్రానికి మాత్రమే. అయితే ‘అఖండ’ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆంధ్రలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల రీత్యా అయితే ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. ఆ చిత్రం కలెక్ట్ చేసింది కూడా కేవలం రూ.50 కోట్ల షేర్ మాత్రమే.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?