ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

  • November 3, 2021 / 09:34 PM IST

హీరోయిన్స్ ను సినిమాల్లో చాలా వరకు గ్లామర్ కే పరిమితం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. పాటలు వచ్చినప్పుడు హీరోయిన్లు ఎంట్రీ ఇస్తే చాలు అన్నట్టు హీరోయిన్ల పాత్రలు ఉంటాయి. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్లు తమ అందంతో పాటు విలనిజంతో కూడా ఆకట్టుకున్నారు. ‘అంత అందంగా హొయలొలికించే హీరోయిన్లలో ఇంత క్రూరత్వం కూడా దాగి ఉందా?’ అనేంతలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ ప్లే చేసి ఔరా అనిపించారు.ఈ లిస్ట్ లో 10 మందికి పైనే హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో..వాళ్ళు విలనిజంతో మెప్పించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) రమ్యకృష్ణ :

ఈ లిస్ట్ లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ రమ్యకృష్ణ. ‘నరసింహ’ సినిమాలో రజినీ కాంత్ వంటి సూపర్ స్టార్ నే డామినేట్ చేసే విధంగా ఈమె పాత్ర ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమాలో కూడా రమ్యకృష్ణ విలన్ గా నటించింది.

2) భాను ప్రియా :

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘గూఢాచారి 117’ మూవీలో భాను ప్రియ డబుల్ రోల్ ప్లే చేసింది. ఇందులో ఓ పాత్రలో ఆమె విలన్‌గా నటించింది. చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 786’ మూవీలో కూడా ఈమె నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది.

3)సౌందర్య :

శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నా మానసిస్తా రా’ సినిమాలో ఈమె విలన్ పాత్రని పోషించింది. కానీ సౌందర్యని ఆడియెన్స్ అలా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

4)రాశి :

మహేష్ బాబు- తేజ కాంబినేషన్లో వచ్చిన ‘నిజం’ సినిమాలో ఈమె విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది.

5) శ్రేయా రెడ్డి :

విశాల్ హీరోగా నటించిన ‘పొగరు’ సినిమాలో ఈమె విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది.

6) నిఖిత :

నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాన్’ చిత్రంలో ఈమె విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది.

7) రీమా సేన్ :

కార్తీ హీరోగా తెరకెక్కిన ‘యుగానికి ఒక్కడు’, శింబు హీరోగా నటించిన ‘వల్లభ’ వంటి చిత్రాల్లో ఈమె నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది.

8)సమంత :

విక్రమ్ హీరోగా వచ్చిన ‘పత్తు ఎంద్రాకుల్లా’ మూవీలో విలన్‌ పాత్రలో కనిపించి మెప్పించింది సమంత. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు.

9) తమన్నా :

ఇటీవల వచ్చిన నితిన్ ‘మాస్ట్రో’ లో విలన్ పాత్రని పోషించి మెప్పించింది తమన్నా.

10)రెజీనా :

అడివి శేష్ హీరోగా వచ్చిన ‘ఎవరు’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది రెజీనా.

11)కాజల్ :

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది కాజల్.

12) పాయల్ రాజ్ పుత్ :

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో విలన్ పాత్రని పోషించి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది పాయల్.

13) త్రిష :

‘ధర్మయోగి’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది త్రిష.

14) ప్రియమణి :

‘చారులత’ అనే సినిమాలో ప్రియమణి డబుల్ రోల్ ప్లే చేసింది. అందులో ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కూడుకున్నది.

15) వరలక్ష్మీ శరత్ కుమార్ :

‘పందెం కోడి2’ ‘తెనాలి రామకృష్ణ బిఏబియల్’ ‘క్రాక్’ వంటి చిత్రాల్లో విలన్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది వరలక్ష్మీ శరత్ కుమార్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus