Science-Fiction Movies: టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!

టాలీవుడ్ కు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనేవి కొత్త అనుభవాన్ని ఇస్తుంటాయి. ఈ జోనర్ కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా హాలీవుడ్లో రూపొందుతుంటాయి. మెల్లగా అది టాలీవుడ్ కు కూడా పాకింది. అయితే ఎక్కువ మంది దర్శకనిర్మాతలు ఈ నేపథ్యంలో సినిమాలు రూపొందించడానికి భయపడేవారు. అందులో రిస్క్ కూడా ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో ప్రేక్షకులు పెద్దగా లాజిక్ లు వంటివి వెతకరు. కానీ ఇలాంటి సినిమాల విషయంలో మాత్రం కోడిగుడ్డు మీద వెంట్రుకలు వెతికినట్టు వెతుకుతుంటారు. అలా వీటిని ప్రేక్షకులు పట్టించుకోరని చెప్పడం కూడా తప్పే..!

ఇలాంటి ఊహకందని అద్భుతాల్ని ఆదరించడానికి కొంతమంది ప్రేక్షకులు ముందడుగు వేశారు. ఇప్పుడు అది మరింతగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ రూపొందుతున్నాయి. మరీ ముఖ్యంగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’ దగ్గర్నుండీ లెక్కేసుకుంటే ఈ లిస్టు పెద్దదే. గతంలో కూడా టైం ట్రావెల్ కధాంశంతో అలాగే సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1) ఆదిత్య 369 :

బాలకృష్ణ- సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా టైం ట్రావెల్ కధాంశంతో కూడుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీనే..! టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.

2) నాని :

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందింది. కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు.

3)రోబో :

రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతోనే రూపొందింది.

4)24 :

2016 లో సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రం టైం ట్రావెల్ కధాంశంతో కూడుకున్న సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందింది.

5)2.ఓ :

రజినీకాంత్-శంకర్ కాంబినేషన్లో ‘రోబో’ కి సీక్వెల్ గా వచ్చిన సైన్స్ ఫిక్షన్ కథాంశంతోనే రూపొందింది

6)ప్లే బ్యాక్ :

దినేష్ తేజ్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం కూడా సైన్స్ ఫిక్షన్ కథాంశంతోనే రూపొందింది.

7)టాక్సీవాలా :

ఇది కూడా సైన్స్ ఫిక్షన్ పాయింట్ తోనే రూపొంది సక్సెస్ అందుకుంది.

8) అద్భుతం :

తేజ సజ్జ, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కమ్ టైం ట్రావెల్ కథాంశంతో రూపొందింది.

9)శ్యామ్ సింగరాయ్ :

నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం కూడా సైన్స్ ఫిక్షన్ కథాంశంతోనే రూపొందుతున్నట్టు వార్తలు వచ్చాయి. అది ఎంత నిజమో డిసెంబర్ నెల వరకు ఎదురుచూడాలి.

10) ప్రాజెక్ట్ K :

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ కూడా సైన్స్ ఫిక్షన్ మరియు టైం ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు టాక్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus