ఈరోజు అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చారు. అలాగే అతను నటిస్తున్న ‘థాంక్యూ’ ‘బంగార్రాజు’ వంటి సినిమాలకి సంబంధించి అప్డేట్లను కూడా ఇచ్చారు. వరుసగా ‘మజిలీ’ ‘వెంకీమామ’ ‘లవ్ స్టోరీ’ వంటి హిట్లని అందుకుని ఫుల్ ఫామ్లో ఉన్నాడు చైతూ. నటుడిగా ఒక్కో మెట్టు పైకెక్కుతూ ప్రేక్షకులకి మంచి ప్రామిసింగ్ హీరోగా అలాగే నిర్మాతలకి మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. మరో రెండు హిట్లు పడితే కచ్చితంగా అతను స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా… నాగ చైతన్య తన 12 ఏళ్ళ సినీ కెరీర్లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసాడు. అందులో 3 బ్లాక్ బస్టర్లు ఒక హిట్టు సినిమా కూడా ఉంది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కొత్త బంగారు లోకం :
నిజానికి ఈ చిత్రంతోనే నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కథకి నో చెప్పాడు చైతన్య.
2) గౌరవం :
ఎందుకో కొన్ని కారణాల వల్ల చైతన్య ఈ సినిమా చేయలేకపోయాడు. తర్వాత అల్లు శిరీష్ చేయడం ఇది ప్లాప్ అవ్వడం జరిగింది.
3) భలే భలే మగాడివోయ్ :
నాని చేసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ కథ మొదటిగా నాగ చైతన్య వద్దకే వెళ్ళింది. ఎందుకో అతను మిస్ చేసుకున్నాడు.
4) అఆ :
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని కూడా నాగ చైతన్య మిస్ చేసుకున్నాడు.
5) సమ్మోహనం :
ఈ హిట్టు సినిమాని కూడా నాగ చైతన్య మిస్ చేసుకున్నాడు. తర్వాత అది సుధీర్ బాబు చేయడం జరిగింది.
6) రిపబ్లిక్ :
‘ఆటో నగర్ సూర్య’ తెరకెక్కిస్తున్న టైంలోనే దేవా కట్టా ఈ కథని చైతన్యకి వినిపించాడు. కథ చైతన్యకి నచ్చింది కానీ ఎందుకో ఈ ప్రాజెక్టులో అతను భాగం కాలేకపోయాడు.
7)మహాసముద్రం :
అజయ్ భూపతి ఈ కథని నాగ చైతన్యకి కూడా వినిపించాడు. కానీ ఎందుకో అతను ఈ ప్రాజెక్టుకి కమిట్ అవ్వలేదు.
8)వరుడు కావలెను :
ఈ కథ కూడా ముందుగా నాగ చైతన్య వద్దకే వెళ్ళింది. కానీ వద్దన్నాడు.
9)అన్ని మంచి శకునములే :
దర్శకురాలు నందినీ రెడ్డి ముందుగా ఈ కథని చైతన్యకే వినిపించింది. కానీ ఎందుకో చై ఈ ప్రాజెక్టుకి నో చెప్పాడు.
10) ‘ఢమరుకం’ :
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయడానికి చైతన్య రెడీ అయ్యాడు. కానీ దానిని అతను సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు.