నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. వీకెండ్ డేస్ లో కూడా ‘అఖండ’ మంచి కలెక్షన్లను రాబడుతుంది.దాదాపు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయినట్టే… కాకపోతే ఆంధ్రలో ఇంకా ఈ చిత్రం ఇంకా రాబట్టాల్సి ఉంది.
ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 14.90 cr |
సీడెడ్ | 10.92 cr |
ఉత్తరాంధ్ర | 4.55 cr |
ఈస్ట్ | 3.01 cr |
వెస్ట్ | 2.48 cr |
గుంటూరు | 3.62 cr |
కృష్ణా | 2.71 cr |
నెల్లూరు | 1.98 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 44.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 8.90 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 53.15 cr |
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.53.15 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆంధ్రలో ఈ వీకెండ్ భారీగా కలెక్ట్ చేస్తేనే అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఈ వీకెండ్ అఖండ కి చాలా కీలకం.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!