అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా చేస్తున్న రెండో సినిమాపై బాగా దృష్టిపెట్టారు. కథ దగ్గర నుంచి అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి మనం వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో ఈ మూవీని నాగార్జున ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. కేవలం ఈ షెడ్యూల్ కోసమే 12 కోట్లు ఖర్చు పెట్టారు. రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
బాలీవుడ్ హీరోయిన్ అలియా బట్ ని తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి ని నాగార్జున సెలక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ వార్తలు నిజం కావని నాగ్ స్పష్టం చేశారు. తాజాగా అఖిల్ తో నటించే హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మలయాళ డైరక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ని సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈమె విక్రమ్ ఇంకొక్కడు సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేసింది. తొలిసారిగా అఖిల్ సినిమాతో తెరముందుకు వస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.