అఖిల్ బాబు స్టంట్స్!

  • November 9, 2017 / 06:39 AM IST

పరిచయ చిత్రంతోనే జీవితంలో మర్చిపోలేని స్థాయి పరాజయాన్ని చవిచూసిన అఖిల్ తన రెండో సినిమా కోసం దాదాపు ఏడాది గ్యాప్ తీసుకోవడం మాత్రమే కాదు బయటి నిర్మాణ సంస్థలను నమ్ముకోకుండా స్వంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సదరు చిత్రాన్ని నిర్మింపజేస్తూ.. ఆ చిత్రానికి దర్శకుడిగా తనను రెండోసారి వెండితెరకు పరిచయం చేసిన విక్రమ్ కుమార్ ను దర్శకుడిగా ఎంచుకొన్నాడు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర ఏమిటనే విషయం ఇప్పటివరకూ బయటకి రాలేదు. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం గురించి మాకు కొన్ని కీలకమైన మరియు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఈ చిత్రంలో అఖిల్ ఒక స్టంట్ మేన్ గా కనిపించనున్నాడు. అందుకే ఇప్పటివరకూ విడుదలైన రెండు పోస్టర్లలోనూ రెగ్యులర్ గా నిల్చోకుండా ఒక పోస్టర్ లో గోడపై పరిగెడుతుంటే.. మరో పోస్టర్ లో ఆకాశమంత ఎత్తున్న భవనంపై రివర్స్ లో నిల్చోని ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఇకపోతే.. అసలు “హెలో” సినిమాలో విలన్ అనేవాడు ఉండడట. చాలా సింపుల్ లవ్ స్టోరీగా “హెలో”ను తెరకెక్కిస్తున్నాడట విక్రమ్ కుమార్. చూద్దాం మరి అఖిల్ ఈ చిత్రంతోనైనా విజయం సాధిస్తాడో లేదో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus