అఖిల్ ఆ మలయాళం రీమేక్ లో నటిస్తాడా ??

Advertisement

అక్కినేని మూడోతరం నటవారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు, అప్పుడే అతడి మూడో సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో ఉండబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. అప్పుడే అఖిల్ నాలుగో సినిమా కూడా సెట్ అయిపోయిందని కథనాలు వెలువడుతున్నాయి.

గత శుక్రవారం మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన “కమ్మటిపాదం” చిత్రాన్ని తెలుగులో అఖిల్ తో, హిందీలో అర్జున్ కపూర్ తో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. అఖిల్ సినిమాల విషయంలో జరుగుతున్న ఈ రచ్చ అక్కినేని అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus