Akhil: రెండేళ్లుగా వీటిని మెయింటైన్ చేయడమే సరిపోయింది!

అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత మరొక నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు గురించి ఇటు నాగచైతన్య గాని శోభితగాని ఏమాత్రం స్పందించడం లేదు అయితే ఈ వార్తలు కొంతకాలం పాటు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ గత కొద్ది రోజుల క్రితం లండన్ లో వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఫోటో కూడా బయటకు వచ్చింది.

ఇలా లండన్ వీధులలో వీరిద్దరూ జంటగా చక్కర్లు కొట్టడంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని,త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ ఫోటోపై ఇప్పటివరకు నాగచైతన్య ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా ఈ ఫోటో గురించి అఖిల్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అఖిల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు (Akhil) అఖిల్ ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఒక ప్రతినిధి అఖిల్ ను ప్రశ్నిస్తూ నాగచైతన్య శోభిత డేటింగ్ గురించి ప్రశ్నలు వేశారు.మీ అన్నయ్య నాగచైతన్య ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని ఇద్దరు కలిసి హోటల్ కి కూడా వెళ్లారని వార్తలు వచ్చాయి మరి మీ పరిస్థితి ఏంటి అని రిపోర్టర్ అఖిల్ ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అఖిల్ సమాధానం చెబుతూ నాగచైతన్య శోభిత ఫోటో గురించి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేయడమే కాకుండా తన పరిస్థితి గురించి వివరించారు.

గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం తను ఈ జుట్టు బాడీని మెయింటైన్ చేయడమే సరిపోయింది.. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉందంటూ ఈ సందర్భంగా అఖిల్ చెప్పినటువంటి సమాధానం వైరల్ గా మారింది. ఇక చైతన్య శోభిత ఫోటో గురించి అఖిల్ సమాధానం చెప్పకుండా దాట వేయడంతో వీరిద్దరి మధ్య నిజంగానే రిలేషన్ కొనసాగుతుందేమోనని పలువురు భావిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus