Akhil: అఖిల్‌ లైనప్‌లో భారీ ప్రొడక్షన్‌ హౌస్‌లు.. క్లిక్‌ అయితేనా?

  • March 2, 2023 / 02:07 PM IST

‘ఏజెంట్’ సినిమా మీద అఖిల్‌ అండ్‌ టీమ్‌కి, ఇటు ప్రేక్షకులు, అభిమానులకు ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ.. ఆ తర్వాత వచ్చే సినిమాల విషయంలో అదిరిపోయే బజ్‌ వినిపిస్తోంది. ‘ఏజెంట్‌’ విషయంలో డౌట్స్‌కి సినిమ వాయిదాలు కారణమైతే.. ఆ తర్వాత వచ్చే సినిమాల విషయంలో క్రేజ్‌కి ఆయా నిర్మాణ సంస్థలే కారణం అని తెలుస్తోంది. కావాలంటే ఈ వార్త పూర్తిగా చదివే లోపు ఆ సినిమాల మీద మీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నిర్మాణ సంస్థల ట్రాక్‌ రికార్డు అలాంటిది మరి.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ మీద సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌ విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ.. కొత్త అఖిల్‌ను అయితే చూస్తున్నాం క్లిక్‌ అయితే అంతకంటే ఆనందం ఏముంటుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. సినిమా సంగతి వచ్చే నెలాఖరులో తేలిపోతుంది. అయితే ఆ సినిమా తర్వాత అఖిల్‌ ఏం చేస్తాడు అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తోంది. ‘కేజీయఫ్‌’ సినిమాలు, ‘కాంతారా’ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్లు అందుకున్న హోంబ‌లే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో అఖిల్‌ తర్వాతి సినిమా ఉంటుంది అంటున్నారు.

టాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి హోంబలే చాలా రోజులగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌తో సినిమాలు అనౌన్స్‌ చేసింది. ప్రభాస్‌తో ‘సలార్‌’ షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ త్వరలో సినిమా షురూ చేస్తారు. వీటితోపాటు అఖిల్‌ కోసం ఓ కథ సిద్ధమైందట. దర్శకుడు ఎవరనేది తెలియదు కానీ.. అఖిల్‌ కెరీర్‌లో రూపొందబోయే భారీ బడ్జెట్‌ సినిమా ఇదే అవుతుంది అని టాక్‌. అలాగే యూవీ క్రియేష‌న్స్‌లో అఖిల్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇది ఇప్పటి మాట కాదు. రామ్‌చరణ్‌తో సినిమా అనుకున్నప్పుడే.. ఈ సినిమా అని కూడా అనుకున్నారు. కానీ అప్పటి నుండి వీలవడం లేదు. అయితే ఇప్పుడు పక్కాగా ఓ కథను ఫైనల్‌ చేసుకున్నారనట. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం అవుతారట. ఈ సినిమా కూడా ఈ సంవత్సరమే సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ సినిమాలు కాకుండా నాగార్జున – మోహ‌న్ రాజా కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రంలోనూ నాగ్‌ వందో చిత్రంలోనూ అఖిల్ న‌టిస్తున్నాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus