ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

టెక్నాలజీ ఎంత పెరిగినా.. కాలం మారుతున్నా.. సమయానికి పెళ్లి కావట్లేదని.. సన్నగా ఉన్నామనీ, బట్ట తల ఉందనీ.. లావు తగ్గాలనీ.. పొట్ట పోవాలనీ ఇంకా నానా బాధలు పడేవారి పరిస్థితిలో మాత్రం ఏం మార్పు రాలేదు.. వీళ్లవి ఇలాంటి బాధలైతే.. తినాలని ఉన్నా కడుపు కట్టుకుని.. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. జీరో సైజ్ అని, సిక్స్, ఎయిట్ ప్యాక్స్ అని హీరో హీరోయిన్లు కష్టపడుతుంటారు.. ఆర్టిస్టులంటే ఫిజిక్ మెయింటెన్ చెయ్యడం ఒక్కటే కాదు.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. వెయిట్ తగ్గడం, పెరగడం లాంటివి చేయాల్సిందే..

హీరోయిన్లంటే గ్లామర్.. గ్లామర్ అంటే బ్యూటిఫుల్ హీరోయిన్స్ కాబట్టి అందం సంగతి పక్కన పెడితే.. వాళ్లకి ఫిజిక్ మెయింటినెన్స్ ఇంపార్టెంట్.. అందానికి అదృష్టం తోడైనట్టు కాస్త టాలెంట్ ఉంటే స్టార్ హీరోయిన్‌గా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటొచ్చు.. అలాంటి వారికి హైట్‌తో పెద్దగా పని లేదు.. అదే హీరోల విషయానికొస్తే.. హ్యాండ్సమ్ హంక్, హాలీవుడ్ కటౌట్, ఆరడుగుల ఆజానుబాహుడిలా కనిపించాలి.. అలాగంటే టక్కున ప్రభాస్, మహేష్ బాబు, గోపిచంద్ లాంటి యాక్టర్స్ గుర్తొస్తారు..

అయితే ఇప్పటి జెనరేషన్‌తో పాటు అసలు ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వని ఓ టీనేజ్ కుర్రాడు.. అదేనండీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, కొణిదెల నట వారసుడు.. లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్ కూడా సాలిడ్ హైట్‌ ఉంటాడు.. చూడగానే ‘అతడు’ మూవీలో బ్రహ్మీ.. ‘వీడేంటి ఇంత లెంగ్తున్నాడు’ అనే డైలాగ్ గుర్తొస్తుంది.. విషయానికొస్తే.. మన టాలీవుడ్‌లో ఆరడుగులు, అంతకుమించి ఉన్న 10 మంది హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

1) అకీరా నందన్ – 6.5 ఇంచెస్

2) వరుణ్ తేజ్ – 6.4 ఇంచెస్

3) రానా – 6.3 ఇంచెస్

4) తొట్టెంపూడి వేణు – 6.3 ఇంచెస్

5) ప్రభాస్ – 6.2 ఇంచెస్

6) మహేష్ బాబు – 6.2 ఇంచెస్

7) అల్లరి నరేష్ – 6.2 ఇంచెస్

8) గోపిచంద్ – 6.1 ఇంచెస్

9) నాగార్జున – 6 అడుగులు

10) సుమంత్ – 6 అడుగులు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus