స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే

ఈ మధ్య కాలంలో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి…పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపిసితారు అన్న న్యూస్ టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. తమ్ముడైన పవన్ కి చిరు ఫ్యాన్ గా నైటిస్తున్నాడు అనే న్యూస్ మెగాఫ్యాన్స్ కి మాత్రమే కాదు…మిగతా సినిమా జనాల్లో కూడా కొంచెం ఇంటరెస్ట్ క్రియేట్ చేసింది.

ఇలా ఒక హీరో ఇంకో హీరోకి ఫ్యాన్ గా, లేదా హీరోయిన్స్ ఒక హీరోకి ఫ్యాన్ గా యాక్ట్ చేసిన సందర్బాలు ఇదేమి కొత్త కాదు. ఇంతక ముందు కూడా ఇలా చాల సందర్భాల్లో మన హీరోస్ & హీరోయిన్స్,…కొందరు స్టార్ హీరోస్ కి ఫాన్స్ గా యాక్ట్ చేసారు…అందులో కొన్ని ఇప్పుడు చూసేద్దాం…

1. చిరంజీవి ఫ్యాన్ గా రవితేజ

ఇడియట్ సినిమాలో రవితేజ… మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ గా కనిపించాడు…ఈ మూవీ lo ఇంద్ర మూవీ రిలీజ్ కి థియేటర్ దగ్గర రచ్చ చేసే సన్నివేశాలు ఉంటాయి.

2. రజిని ఫ్యాన్ గా ప్రభాస్

బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్… రజినీకాంత్ వీరంభిమాని గా కనిపించాడు..ఈ సినిమాలో రజిని రెఫరెన్సెస్ పిచ్చ పిచ్చగా ఉంటాయి అంతే కాదు తలైవర్ మీద ఒక సాంగ్ కూడా ఉంటది.

3. అమితాబ్ కి ఫ్యాన్ గా రవితేజ

డాన్ శీను సినిమాలో మన మాస్ మహారాజ్ రవితేజ తన అభిమాన హీరో అయినా అమితాబ్ బచ్చన్ కి ఫ్యాన్ గా యాక్ట్ చేసాడు. ఇందులో అమితాబ్ సినిమాల్లో డైలాగ్స్ కొన్ని ఉంటాయి.

4. స్వాతి మహేష్ బాబు ఫ్యాన్ – అష్ట చమ్మా

అష్ట చమ్మా సినిమాలో స్వాతి…మన మహేష్ బాబు కి డై హార్డ్ ఫ్యాన్ గా యాక్ట్ చేసింది…

5. నాని బాలయ్య ఫ్యాన్

కృష్ణ గాడి వీర ప్రేమ గాఢ సినిమాలో నాని బాలయ్య బాబు కి ఫ్యాన్ గా చేసాడు. నాని కి చేయి మీద జై బాలయ్య బాబు టాట్టూ కూడా ఉంటుంది ఈ సినిమాలో.

6. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సాయి పల్లవి

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాలో, సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ గర్ల్ గా చేసింది. ఈ సినిమాలో సాయి పల్లవి పవన్ కళ్యాణ్ ఐకానిక్ నెక్ మన్నేరిజం కూడా చేస్తుంది.

7. నాగ చైతన్య మహేష్ బాబు ఫ్యాన్

నాగ చైతన్య… థాంక్యూ మహేష్ బాబు ఫ్యాన్ గా యాక్ట్ చేసాడు. ఇందులో మహేష్ బాబు కటౌట్ కి నాగ చైతన్య పాలాభిషేకం కూడా చేస్తాడు.

8. సుహాస్ – Jr NTR ఫ్యాన్

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో సుహాస్ మన జూ ఎన్టీఆర్ కి ఫ్యాన్ గా యాక్ట్ చేసాడు.

9. నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్

రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ki పెద్ద వీరాభిమాని అయినా నితిన్ తాను చేసిన చాలా సినిమాల్లో పీకే రిఫరెన్సెస్ ఉంటాయి…. చిన్నదానా నీకోసం సినిమాలో అయితే పీకే కి ఫ్యాన్ గా కనిపించాడు.

10. శ్రీ విష్ణు – జూ ఎన్టీఆర్ ఫ్యాన్

శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ అర్జున ఫాల్గుణ లో జూ ఎన్టీఆర్ కి ఫ్యాన్ గా యాక్ట్ చేసాడు…ఈ సినిమాలో ప్లాట్ అంత జూ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది.

11. చిరంజీవి – పవన్ కళ్యాణ్ ఫ్యాన్

చిరంజీవి భోళా శంకర్ సినిమాలో… చిరు పీకే ఫ్యాన్ గా కనిపించబోతున్నారు అని టాక్. అంతే కాదు ఈ సినిమాలో శ్రీ ముఖి తో కలిసి చిరు ఖుషి సినిమాలోని నడుము స్పూఫ్ చేస్తున్నారంట…

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus