ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో తెలిసిందే.. ప్రపంచ నలుమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రమోషన్లలో సామాజిక మాధ్యమాలదే హవా.. ఫ్యాన్ పేజెస్, ప్రొడక్షన్ హౌసెస్, పీఆర్‌వోలు ఇచ్చే అప్ డేట్స్ ఎంతలా సందడి చేస్తుంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు.. అలాగే స్టార్లకు ట్విట్టర్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉంటారు.. సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతీ విషయం షేర్ చేస్తుంటారు మేకర్స్..

రిలీజ్, ఆ తర్వాత కలెక్షన్ల వంటి వివరాలు కూడా జనాలకు తెలిసిపోతుంటాయి.. ఇక, తమ అభిమాన హీరో సినిమా అప్ డేట్స్, బర్త్‌డే వంటి సందర్భాలలో స్పెషల్ హ్యాష్ ట్యాగ్లతో ఫ్యాన్స్ చేసే హంగామా మూమూలుగా ఉండదు.. ఒకరి రికార్డుని మరొకరు బీట్ చేయాలని టైం సెట్ చేసుకుని మరీ ట్రెండ్ చేస్తుంటారు.. ఈ విషయంలో సౌత్ హీరోలదే హవా.. ప్రభాస్ నుండి అజిత్ కుమార్, దర్శన్ లాంటి స్టార్ హీరోల అభిమానులు కూడా సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేశారు.. తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలకు సంబంధించి గత నెల రోజుల్లో ఏ యాక్టర్ గురించి ఫ్యాన్స్, నెటిజన్లు ఎక్కువగా ట్వీట్ చేశారో.. ఎన్ని మిలియన్ల ట్వీట్స్ వేశారో ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1) దళపతి విజయ్ – 1.7 మిలియన్స్..

2) తల అజిత్ కుమార్ – 1.14 మిలియన్స్..

3) జూనియర్ ఎన్టీఆర్ – 1+ మిలియన్..

4) ధనుష్ – 991K

5) ప్రభాస్ – 905 K

6) రామ్ చరణ్ – 881 K

7) మహేష్ బాబు – 791 K

8) పవన్ కళ్యాణ్ – 787 K

9) ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ – 703 K

10) సూర్య – 667 K

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus