బిగ్ బాస్4: రేటింగ్ కోసం రచ్చ రచ్చ..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ఇక ఈ నామినేషన్స్ లో అనూహ్యంగా అఖిల్ మోనాల్ ని నామినేట్ చేశాడు. సండే ఎపిసోడ్ లో వీరిద్దరికీ చిన్న క్లాష్ అయ్యింది. దీనికి ఎక్స్ ప్లనేషన్ ఇచ్చేందుకు మోనాల్ అఖిల్ దగ్గరకి కూడా వచ్చింది. కానీ అఖిల్ ఎప్పటిలాగానే మోనాల్ ని ఎవైడ్ చేశాడు. అయితే, అది నామినేషన్స్ కి దారితీసేంత ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన పాయింట్. మోనాల్ అవినాష్ ని కిస్ చేయడమే దీనికి కారణమా..? లేదా ఇంకా ఏదైనా బలమైన కారణంతో అఖిల్ మోనాల్ పై అలిగాడా అనేది తెలియాలి. అంతేకాదు, మోనాల్ తర్వాత అమ్మరాజశేఖర్ తో మాట్లాడతూ, గేమ్ ఆన్ అయ్యిందని, వెల్ కమ్ టు ద గేమ్ అని అంది అమ్మాయి – అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు.. ఇంకా మోర్ కావాలి అంటూ అమ్మరాజశేఖర్ తో మాట్లాడటం దీన్ని ప్రోమోగా చూపించడం తో ఈ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అంతేకాదు, ఇప్పుడు ఈ ప్రోమో వల్ల రేటింగ్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నామినేషన్స్ ని రెండు ఎపిసోడ్స్ దీనిని చూపిస్తున్నారు అంటే ఏ రేంజ్ లో షో ఉందో అర్ధం అవుతోంది. అంతేకాదు, హౌస్ మేట్స్ గేమ్ ఎలా మారుస్తున్నారో ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చేస్తున్నారు ఈ నామినేషన్స్ లో. అభిజిత్ అండ్ అవినాష్ ల మద్యన పెద్దవార్ జరిగింది. నామినేషన్స్ లో నువ్వా నేనా అన్నట్లుగా మాట్లాడుకున్నారు ఇద్దరూ. అవినాష్ అయితే సెటైర్లు కూడా వేశాడు. నువ్వు వేసే జోక్స్ వల్ల ఎదుటివాళ్లు హర్ట్ అయినా పర్లేదా అనే పాయింట్ పైన మాట్లాడుతున్నారు.

ఎంటర్ టైన్మెంట్ కి ఒక హద్దు ఉంటుందని కూడా హెచ్చరించే ప్రయత్నం చేశాడు అభిజిత్. అయితే, దీన్ని అవినాష్ యాక్సెప్ట్ చేసే స్థితిలో లేడు. వీరిద్దరి తర్వాత అమ్మరాజశేఖర్ విషయంలో కూడా అభిజిత్ కి గట్టిగానే పడింది. దీనంతటికి నోయల్ చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా ఇన్ఫులెన్స్ చేశాయనే చెప్పాలి. ఏదో ఒక రీజన్ తో ఖచ్చితంగా ఇంకోవారం కూడా హౌస్ మేట్స్ ఇదేవిషయంలో నామినేట్ చేస్కుంటారు అనిపిస్తోంది. మరి ఆసక్తికరంగా మారిన ఈ నామినేషన్స్ ఎలా ఎండ్ అవుతాయో చూడాలి. అదీ మేటర్.


‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus