మళ్లీ అదే బాటలో అఖిల్!!!

  • April 13, 2017 / 07:36 AM IST

టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి అనేది అందరికీ తెలిసిన విషయమే…అప్పటికీ నాగేశ్వర రావు నుంచి…ఇప్పటి నాగ్ కుమారుడు నాగ చైతన్య వరకూ ఇండస్ట్రీ లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి హీరోలుగా కొనసాగుతున్నారు…ఇక నాగ్ అయితే తన కుమారులు ఇద్దరూ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నాప్పటికీ ఇంకా వారికి పోటీగా నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు…ఇదిలా ఉంటే మొదటి కుమారుడు చైతుని ఇండస్ట్రీలో మంచి  హీరోగా నిలిపిన నాగ్…తన రెండో కుమారుడు అభిల్ ని సైతం అలానే నిలపాలని విశ్వ ప్రయత్నాలే చేసి దెబ్బతిన్నాడు…..అక్కినేని అఖిల్ మొదటి సినిమా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించేలా చేయగలిగిన నాగ్….

రిసల్ట్ ను మాత్రం ముందే ఊహించకపోవడంతో…సినిమా డిజాస్టెర్ గా మారి….అక్కినేని అభిమానుల ఆశల్ని నీరు గార్చింది…అయితే ఈ పరాజయానికి అసలు కారణం ఏంటి అంటే….సినిమా ఆద్యంతం యాక్షన్ తో కూడుకున్నది కావడంతో అఖిల్ పెద్దగా ఆకట్టుకోలేక పోవడమే. అయితే గతాన్ని మరచి తన రెండో సినిమాపై ఫోకస్ పెట్టిన అఖిల్….తన తండ్రి, అన్నయ్య లాగా లవ్, సెంటిమెంట్ ఉన్న చిత్రాలతో నటించి మెప్పించాలి అని అనుకున్నాడు….అదే క్రమంలో ….అఖిల్ కూడా మంచి లవ్ స్టోరీతో చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అదే క్రమంలో అఖిల్ రెండో సినిమా విభిన్న కథా చిత్రాలు అందిస్తున్న విక్రం కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే…ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అసలు కధ ఇక్కడే ఉంది…ఈ సినిమాలో అప్పుడే యాక్షన్ దృశ్యాలను అది కూడా ఇంటర్నేషనల్ యాక్షన్ నిపుణులను రప్పించి మరీ షూట్ చేస్తున్నారు.  ఇక ఈ చిత్రం కూడా భారీ యాక్షన్ చిత్రంగా ఉండబోతుందా అని అనుమానాలు వస్తున్నాయి. అసలే మొదటి సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువైన కారణంతో సినిమా డమాల్ అంది….ఇప్పుడు అదే తప్పు అఖిల్ మళ్లీ చేస్తున్నట్లు అనిపించడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు….మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus