టాలీవుడ్ లో అక్కినేని వంశం నుంచి యువ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకడు…ఈ యువ హీరో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు అన్న టాక్ వినిపించగానే ఒక్కసారిగా అందరూ అతన్నే ఫోకస్ చేశారు…అదే క్రమంలో అఖిల్ పై క్రేజ్ కూడా పీక్స్ కి వెళ్లిపోయింది. ఇక ఆ క్రేజ్ చూసి ఈ హీరో ఇండస్ట్రీని శాసిస్తాడు అని అందరూ అనుకున్నారు…కానీ అనుకోకుండా అఖిల్ చేసిన తొలి ప్రయత్నం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది టాలీవుడ్. ఇదిలా ఉంటే సినిమా పోయినా అఖిల్ పై క్రేజ్ మాత్రం అలానే ఉంది…అయితే మరో విషయం ఏమిటి అంటే…ఈ క్రేజ్ వల్లనే అఖిల్ తో మెగా హీరోయిన్ నిహారిక కొనిదల ఒక సినిమా చేస్తుంది అన్న న్యూస్ సైతం బయటకు వచ్చింది…అయితే ఆ సినిమా పై…ఆ సినిమా రూమర్ పై అఖిల్ స్పందించాడు….ఎప్పుడు? ఎలా అంటే…ఆ మద్య రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారీ’ ప్రోగ్రామ్ లో నిహారికకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు అఖిల్ బయట పెట్టాడు.
అసలు ఏం జరిగిందో క్లుప్తంగా వివరించాడు….గతంలో నిహారికతో కలిసి షార్ట్ఫిలింలో నటించినట్టు చెప్పారు. ‘‘దాదాపు 120 మంది భారీ సంఖ్యలో సభ్యులతో కలిసి ఆ షార్ట్ ఫిలింను తెరకెక్కించాం. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది తన స్నేహితుడు రాజమౌళి తనయుడు కార్తికేయ అని చెప్పాడు. ఆ షార్ట్ ఫిల్మ్ నిడివి ఎక్కువగా ఉండడంతో నా సినిమాలో ఆమె హీరోయిన్ అని అంతా అనుకున్నారు’’ అని అఖిల్ చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటిదాకా ఆ షార్ట్ ఫిల్మ్ మాత్రం విడుదల కాలేదు. కారణం ఆ షార్ట్ ఫిలిమ్ ఔట్ పుట్ సరిగా లేదట. మొత్తానికి ఆ సినిమా కధ అలా ముగిసింది అన్న మాట…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.