ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ ట్రయో ఫొటోలు
- January 3, 2021 / 02:42 PM ISTByFilmy Focus
బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఉన్న బంధాలు బయటకు వచ్చాక అంతగా ఉండవు అంటుంటారు. గత సీజన్లలో చాలా బంధాలు అలా బయటకు వచ్చాక తెగిపోయినవే. కానీ ఈ సీజన్‌లో బంధాలు అలా కనిపించడం లేదు. ముఖ్యంగా అఖిల్ – మోనాల్ రిలేషన్ ఒకటి అయితే, రెండోది సోహెల్ – అఖిల్ రిలేషన్. ఇంటి నుంచి బయటకు వచ్చేసినా ఇంకా వీళ్లు ఇద్దరిగా, ముగ్గురిగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరోసారి ఈ ముగ్గురూ కలిశారట.
ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు అఖిల్, మోనాల్ కలిసే కనిపించేవారు. ఎప్పుడో అలకలు, గొడవల సందర్భంలో తప్ప మిగిలిన సమయాల్లో ఒక దగ్గరే ఉండేవారు. అప్పుడప్పుడు సోహైల్ వీళ్ల మధ్యలోకి వచ్చేవాడు. అయితే బయటకు వచ్చాక వీరిద్దరి మధ్యలోకి మోనాల్ వచ్చింది. ఎలిమినేట్ అయ్యాక రీయూనియన్ రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదంటూ అఖిల్‌ను ఊరించింది మోనల్.

బయటేమో అఖిల్‌కి ఓటేయమని సపోర్టు చేసింది. ఇంటి నుంచి బయటికొచ్చాక ఇంటికి వచ్చి కలిసింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ కలిసింది. ఆ ఫొటోను సోహెల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!














