అఖిల్ , విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో సినిమా ప్రారంభ తేదీ ఖరారు
- November 25, 2016 / 07:34 AM ISTByFilmy Focus
కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సిసింద్రీ తరవాత వెండితెరపైన కనిపించిన మూవీ మనం. ఇందులో అఖిల్ రివీల్ అయ్యే విధానాన్ని డైరక్టర్ విక్రమ్ కె కుమార్ చాలా గొప్పగా చూపించారు. థియేటర్ విజిల్స్ తో నిండిపోయింది. అదే డైరక్టర్ తో అఖిల్ ని హీరోగా నాగార్జున రీ లాంచ్ చేస్తున్నారు. వారి కాంబినేషన్లో రానున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. ముహూర్తపు షాట్ తేదీని కూడా ఫిక్స్ చేశారు.
డిసెంబర్ 12 అఖిల్ పై తొలి షాట్ తీసేందుకు విక్రమ్ కుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అఖిల్, శ్రేయ భూపాల్ ల నిశ్చితార్ధం డిసెంబర్ 9 న జరుగుతుంది. ఈ వేడుక పూర్తి అయిన రెండు రోజులకు అఖిల్ సినిమా ప్రారంభం అవుతుండడం విశేషం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. అలనాటి హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా మేఘ ఆకాష్ ని చిత్ర బృందం సంప్రదిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













