Akhil: అఖిల్ సినిమా ఇప్పట్లో రాదా..?

  • October 15, 2022 / 04:45 PM IST

‘ది ఘోస్ట్’ సినిమాతో డీలా పడ్డ అక్కినేని అభిమానుల ఆశలన్నీ అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’పైనే ఉన్నాయి. కొన్నాళ్లక్రితం ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడడంతో వాయిదా వేశారు. ఆ తరువాత డిసెంబర్ లో సినిమా వస్తుందనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు.

అసలు డిసెంబర్ లో సినిమా వస్తుందా..? రాదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘ఏజెంట్’ సినిమా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. జనవరిలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటున్నారట. అయితే సంక్రాంతి బరిలో భారీ సినిమాలు ఉండడంతో థియేటర్ల సమస్య రావొచ్చు. కాబట్టి జనవరిలో సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అనేది యూనిట్ సభ్యుల అభిప్రాయం. అలా చూసుకుంటే రిపబ్లిక్ డేకు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండకపోవచ్చు.

కాకపోతే అప్పటికి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా రాబోతుంది. తెలుగు మార్కెట్ వరకు ఆ సినిమా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఏజెంట్’ పాయ్న్ ఇండియా సినిమా కాబట్టి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. షారుఖ్ సినిమా కారణంగా ‘ఏజెంట్’ కలెక్షన్స్ పై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు కూడా రిలీజ్ వద్దనుకుంటే..

సమ్మర్ తప్ప మరో ఆప్షన్ ఉండదు. కానీ మరీ అంత ఆలస్యమంటే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇప్పటివరకు అయితే ఈ సినిమా నుంచి టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ కూడా బయటకు రాలేదు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus