మెగాస్టార్ చిరంజీవి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా చిరంజీవి చెల్లి పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఒక దశలో చిరంజీవి చెల్లి పాత్రకు స్టార్ హీరోయిన్ నయనతార దాదాపుగా ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే మెగాస్టార్ చెల్లి పాత్రకు ఏ హీరోయిన్ ఫైనలైజ్ కాలేదని సమాచారం.
ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా చిరంజీవి చెల్లి పాత్ర కోసం నాగార్జున భార్య అక్కినేని అమలను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో నటించడానికి అమల గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అక్కినేని అమల పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గతంలో చిరంజీవి అమల కాంబినేషన్ లో రాజా విక్రమార్క మూవీ వచ్చింది.
యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే అమల ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. తండ్రిని దూరం చేస్తున్నాడని హీరో పాత్రపై విద్వేషంతో రగిలిపోయే చెల్లి పాత్రలో అమల కనిపిస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ క్యాస్టింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.