ఇటు టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ఏదైన ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది అంటే అది అటు సమంతా, ఇటు నాగ చైతన్య పెళ్లి విషయం అని ఇట్టే తెలిసిపోతుంది. అయితే అదే క్రమంలో ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తూ ఉండడం విశేషం. నిన్న గాక మొన్న సమంత ఇదినా లాస్ట్ సినిమా కాదు అని ఏదో తెలియని సందేహంలో అందరినీ పడేస్తే…ఇప్పుడు నాగ్ సైతం సమంత కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ విషయంలోకి వెళితే…సమంత, నాగచైతన్యల పెళ్ళిపై కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే జోరుగా కథనాలు నడుస్తున్న సంధర్భంలో నాగార్జున ఇప్పటికే వీరిద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ లోని ప్రముఖ మీడియా కథానాలను సైతం టెలికాస్ట్ చేయగా…ఇది నాగ్ ఫ్యామిలీ మాత్రం సమంత తో నాగచైతన్య పెళ్ళి వ్యవహారం ఏమి తెలియనట్టుగానే ఉంటున్నారు.
ఇంకా చెప్పాలి అంటే…ఈ న్యూస్ వెబ్ మీడియా, టెలివిజన్స్ లో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవ్వరూ దీనిపై నోరు విప్పకపోవడం విశేషం. అయితే అదే క్రమంలో ఈ విషయాన్ని నాగార్జున కొందరు సన్నిహితులకు మాత్రమే తెలిపి, అందరికీ ఇదంతా ప్రచారం మాత్రమే అని తెలుపడంతో ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి సమంతకు చేరడంతో ఈ న్యూస్ విని ఆమె షాక్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా….ఈ కధకు ముగింపు ఎప్పుడో మరి….