కొత్త బైక్ కొనుగోలు చేసిన చైతన్య.. రేట్ ఎంతో తెలుసా..?

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పెళ్ళైన తరువాత ‘చైసామ్’ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఈ చిత్రంతో పాటు విక్టరీ వెంకటేష్ తో ‘వెంకీ మామ’ చిత్రంలో కూడా చైతు నటించబోతున్న సంగతి తెలిసిందే.

చైతన్యకు మాస్ ఫాలోయింగ్ అంతగా లేకపోయినప్పటికీ.. క్లాస్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే ఉంది. ప్రస్తుతం చైతన్య తన తమ్ముడు అఖిల్ లా డ్యాన్సులు.. ఫైట్ లు ఓ రేంజ్ లో చేయకపోయినప్పటికీ… తన కంటే ముందు వరుసలోనే ఉన్నాడని చెప్పాలి. చైతన్య కెరీర్ స్టార్ట్ చేసాక రెండో చిత్రంతోనే హిట్ అందుకున్నాడు.. కానీ అఖిల్ రెండో చిత్రంతో కూడా మెప్పించలేక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే… వీరిద్దరికీ ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉంది. అదేంటంటే వీరిద్దరికీ… కార్లు, బైక్ ల పై ఆసక్తి బాగా ఎక్కువ. స్పోర్ట్స్ లో కూడా వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అందులోనూ స్పోర్ట్స్ కార్లన్నా.. బైక్ లన్నా… చాలా ఉత్సాహం కనపరుస్తుంటారు. తాజాగా నాగచైతన్య ‘బి.ఎం.డబ్ల్యూ.ఆర్.నైన్.టి’ బైక్ ను కొనుగోలు చేసాడు. దీని రేట్ ఎంతో తెలుసా… ? అక్షరాలా 17.48 లక్షల రూపాయలు కావడం విశేషం. చైతన్య ఈ బైక్ కొనుగోలు చేతున్న పిక్స్ కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus