ఇటీవల నంది అవార్డ్స్ ఎంపిక విషయంలో జరిగిన స్థాయి రచ్చ రాజకీయపరమైన గొడవల విషయంలో సైతం జరగలేదు. ఇవి సైకిల్ అవార్డ్స్ అని కొందరు, తమ కులంవారికి ఇచ్చుకొన్నారని ఇంకొందరు రకరకాలుగా వ్యాఖ్యానించారు. అయితే.. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా 2014 సంవత్సరానికిగానూ జనాల హృదయాలను గెలుచుకొన్న “మనం” లాంటి సకుటుంబ సపరివార చిత్రానికి కాకుండా లెజండ్ లాంటి హింసాత్మకమైన చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డ్ ప్రకటించడం పట్ల ఇండస్ట్రీ వర్గాలే కాక తెలుగు సినిమా అభిమానులు కూడా బాధపడ్డారు.
అయితే.. ఈ విషయమై ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్ చేయడం లేదా రెస్పాండ్ అవ్వడం చేయని అక్కినేని నాగార్జున ఇవాళ “హెల్లో” ప్రమోషన్స్ సందర్భంలో నంది అవార్డ్ “మనం” సినిమాకి రాకపోవడం పట్ల స్పందించారు. తమ సినిమా హృదయాల్ని గెలుచుకొందని.. మాకు ఆస్కార్ అవార్డ్స్ కంటే అవే ఎక్కువ అని అన్నారు. ఇంకా ఈ విషయమై మాట్లాడుతూ.. “నాన్నగారి లాస్ట్ సినిమా “మనం”, ప్రేక్షకులు మా సినిమాకి గుండెలు ఇచ్చారు, అవి చాలు మాకు ఆస్కార్ కూడా అవసరం లేదు” అన్నారు.