డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

‘ధురంధర్‌’ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు దర్శకుడు ఆదిత్య ధర్‌, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పేర్ల తర్వాత చర్చకు వస్తున్న పేరు అక్షయ్‌ ఖన్నా. బాలీవుడ్‌లో వెర్సటైల్‌ హీరోగా, నటుడిగా పేరు తెచ్చుకున్న అక్షయ్‌ తన సత్తాకు తగ్గ పాత్రలు చేయడం లేదు అంటూ కొంతమంది అంటూ ఉంటారు. ఆ కామెంట్లకు సమాధానం ఇస్తూ ఆయన ‘ధురంధర్‌’ సినిమాలో రెహమాన్‌ డెకాయిత్‌ పాత్రలో అదరగొట్టాడు. అయితే ఈ పాత్రను ఆఫర్‌ చేయడానికి కాస్టింగ్‌ డైరక్టర్‌ కాల్‌ చేస్తే డిఫరెంట్‌గా స్పందించారట.

Akshaye Khanna

సినిమాలో హీరో ఎంత పవర్‌ ఫుల్‌గా ఉంటే.. విలన్‌ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. దీనికి నిలువెత్తు నిదర్శనం ‘ధురంధర్‌’ సినిమా. ఇందులో ప్రతినాయకుడిగా అక్షయ్‌ ఖన్నా అదరగొట్టాడు. అయితే ఆ పాత్రను ఎంతోమంది తిరస్కరిస్తే అక్షయ్‌కి వచ్చిందని చాలా రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం. దీని గురించి ఆ సినిమా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ ఛబ్రా మాట్లాడారు. రెహమాన్‌ డెకాయిత్‌ రోల్‌ కోసం చాలామందిని అనుకున్నాం. కానీ వారంతా అంగీకరించలేదు.

దీంతో చివరకు అక్షయ్‌ ఖన్నాకు ఈ సినిమా గురించి చెప్పారట. దానికి అక్షయ్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని లైట్‌ తీసుకున్నాడట. కానీ ముకేశ్‌ వదల్లేదట. ఒక్కసారి కథ వినమని చెప్పి.. నెరేట్‌ చేయించారట. సినిమా కథ మొత్తం విన్న తర్వాత.. తనదైన శైలిలో ‘ఫంటాస్టిక్‌’ అని అన్నాడట అక్షయ్‌. ఆ తర్వాత ఒక రోజు ఆగి ఫోన్‌ చేసి సినిమాలో నేను యాక్ట్‌ చేస్తున్నా అని చెప్పాడట. అలా చాలామందిని దాటి ఆ పాత్ర అక్షయ్‌కి వచ్చింది. ఇప్పుడు ఆ పాత్రకు అవార్డులు కూడా వస్తాయంటున్నారు బాలీవుడ్‌ విమర్శకులు.

ఐబీ చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌గా నటించిన మాధవన్‌ సెలక్షన్‌ గురించి కూడా ముకేశ్‌ చెప్పారు. ‘రంగ్‌ దే బసంతి’ సినిమా టైమ్‌ నుండి తనకు మాధవన్‌ తెలుసని, అందుకే ‘ధురంధర్‌’ సినిమా విషయంలో తనను నమ్మమని అడిగి ఆ పాత్రకు తీసుకున్నామని చెప్పారు.

నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus