సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం రోబో 2.0. శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రజనీ సరసన ఎమి జాక్సన్ జంటగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం చెన్నై లోని ఈవిపి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోండగా..
మే 13 నుంచి అక్షయ్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మే 11 న చెన్నై చేరుకొనున్నారని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో నటిస్తున్న ‘హౌస్ ఫుల్ 3’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా .. చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఇటీవలే ఢిల్లీ లో అక్షయ్, రజనీ మధ్య పలు ఫైటింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.