మరోసారి శంకర్ సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్..!
- January 18, 2019 / 09:23 AM ISTByFilmy Focus
తాజాగా ‘2.0’ చిత్రంతో సంచలనాలు సృష్టించాడు శంకర్. ఇక ఈ చిత్రం తరువాత కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ ( తెలుగులో భారతీయుడు 2) చిత్రాన్ని లైన్లో పెట్టాడు. గతంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతుంది.
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ చిత్రంతో కమల్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించబోతున్నట్టు తాజా సమాచారం. డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ మార్కెట్ కోసం బాలీవుడ్ తారలను తీసుకుంటూ ఉంటాడనే సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన ‘2.0’ చిత్రంలో విలన్ గా అక్షయ్ కుమార్ ను తీసుకున్నాడు. అక్షయ్ క్రేజ్ తో బాలీవుడ్ లో ‘2.0’ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు మరోసారి అక్షయ్ కి తన సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నాడట శంకర్. కథ ప్రకారం ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ముందుగా అజయ్ దేవగన్ ని ఎంపిక చేయాలనుకున్నాడట. అయితే అజయ్ దేవగన్ కాల్ షీట్లు బిజీగా ఉండడంతో అక్షయ్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. దీనికి అక్షయ్ కూడా ఓకే చెప్పేశాడట. ఇక తమిళ హీరో ‘శింబు’ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.













