Alia Bhatt: ఆ లెటర్ పై అలియా షాకింగ్ కామెంట్స్!

  • December 11, 2021 / 11:31 AM IST

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అలియా భట్ పరిచయం కానున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు అలియా భట్ 9 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తుండగా ఈ పాత్ర విషయంలో రాజమౌళి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సినిమాలో అలియా భట్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఈ పాత్ర కోసం అలియా భట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం.

అలియా భట్ లవర్ పేరు రణబీర్‌ కపూర్‌ కాగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు కూడా ఆర్ తోనే మొదలవుతాయనే విషయం తెలిసిందే. దీంతో ఒక విలేఖరి ఆర్ అలియా భట్ లక్కీ ఫ్యాక్టర్ అనుకోవచ్చా? అని అడిగారు. ఆ ప్రశ్నకు అలియా తమాషాగా స్పందించారు. ఈ ప్రశ్నకు తన దగ్గర సరైన సమాధానం లేదని తాను సమాధానం చెప్పాలంటే తెలివిగా వ్యవహరించాలని అలియా అన్నారు.

‘ఆర్‌’ లవ్లీ ఆల్ఫాబెట్ అని అయితే తనకు కలిసొచ్చిన లెటర్ మాత్రం ఎ అని అలియా వెల్లడించారు. హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చిన సమయంలో రాజమౌళి గారిని ఎయిర్ పోర్ట్ లో కలిశానని ఛాన్స్ ఇవ్వాలని కాజువల్ గా అడగగా కొన్నిరోజుల తర్వాత తనకు కాల్ వచ్చిందని అలియా భట్ చెప్పుకొచ్చారు. సీత పాత్ర విని తాను ఎగ్జైట్ అయ్యానని అలియా చెప్పుకొచ్చారు. సీత పాత్ర తనకు చాలా ప్రత్యేకమని జక్కన్న సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అలియా భట్ వెల్లడించారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus