Alia Bhatt Remuneration: గెస్ట్‌ కంటే పెద్ద పాత్ర… డబ్బులూ ఎక్కువే!

Advertisement

ఒక్కోసారి పాత్ర నిడివి ఎంత తక్కువైనా ఉండొచ్చు. స్టార్‌ నటులు ఓకే చెప్పేస్తుంటారు. దానికి మూడు రకాల కారణాలుంటాయి. ఒకటి పాత్ర నచ్చడం. రెండోది నిర్మాణ సంస్థ, నటులతో అనుబంధం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్లు చాలానే ఉన్నాయి, ఉంటాయి కూడా. అయితే మూడోది కూడా ఉంది. అదే రెమ్యూనరేషన్‌. మంచి రెమ్యూనరేషన్‌ ఇస్తే చిన్న పాత్ర అయినా ఒప్పుకుంటారు. అంత చిన్న పాత్రకు అంత డబ్బు ఎందుకు అనుకుంటున్నారా? ఆ స్టార్‌ నటిస్తే తమ సినిమాకు చక్కటి ప్రమోషన్‌ వస్తుంది అనుకుంటే ఎంతైనా ఇస్తారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఆలియా భట్‌ పారితోషికం లెక్కలు బయటకు వచ్చాయి కాబట్టి. సినిమాలో ఆలియా భట్‌ పాత్ర చాలా కీలకం అని చిత్రబృందం చాలా రోజుల నుండి చెబుతూనే ఉంది. అదే సమయంలో నిడివి కూడా తక్కువే ఉంటుందని అని చెబుతోంది. ఆ పాత్ర నిడివి 15 నిమిషాలే అని తాజాగా వార్తలొస్తున్నాయి. అంతే కాదు పావు గంట పాత్ర కోసం ఆమెకు ఐదారు కోట్ల రూపాయలు ఇచ్చారని కూడా తెలుస్తోంది.

ఆలియా భట్‌కు బాలీవుడ్‌లో ఉన్న ఇమేజ్‌ తెలిసింది. మోస్ట్‌ టాలెంటెడ్‌ నాయికల్లో ఆమె ఒకరు. ఎలాంటి పాత్ర అయినా… తనదైన శైలిలో ప్రాణం పెడుతుంది. అలాంటి నాయికను తమ సినిమాలోకి తీసుకుంటే బాలీవుడ్‌లో ఇంకా బాగా ప్రమోషన్‌ సంపాదించొచ్చు అనుకున్నారో ఏమో ఏకంగా అంత డబ్బు ఇచ్చి సినిమాలో తీసుకుంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ఇంత డౌట్‌ ఎందుకు అంటే… టాలీవుడ్‌లో ఆలియాను బ్యాలెన్స్‌ చేసే కథానాయికలు చాలామందే ఉన్నారు మరి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus