“నన్ను” ఇష్టపడరు -సన్నీ లియోన్

  • March 9, 2016 / 06:49 AM IST

పోర్న్ స్టార్…కాదు…కాదు….బోలీవుడ్ టాప్ హీరోయిన్ సన్నీ లియోన్ బాధపడింది, కన్నీరు పెట్టింది. ఇంతకీ సన్నీ బాధపడటం ఏంటి అనేగా మీ ప్రశ్న…వివరాల్లోకి వెళితే….తన కుటుంభంలోని రక్త సంభంఢీకులు తనను వెలి వేశారని, వారు తనతో మాట్లాడరు అని, తనకు కనీసం పట్టించుకోరు అని సన్నీ లియోన ఆవేదన చెందుతుంది. ఇంతకీ దానికి కారణం ఏంటి అంటే…తన గతం అని చెబుతుంది, అవును నిజమే సన్నీ గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, గతంలో ఆమె ఒక పోర్న్ స్టార్, కాదు అనడానికి లేనంత పాప్యులర్ కూడా. ఇక ఇప్పుడున్న పరిస్తితుల్లో సన్నీ లియోన్ ఇండియన్ మూవీ స్టార్స్ ఒకరు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆమె పేరుకు ఓ పెద్ద బ్రాండ్ వాల్యూ కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే తన పేరుతో తనే కంపెనీ స్టార్ట్ చేసేసి ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయగల రేంజ్ కి సన్నీ లియోన్ చేరుకుంది. అలాంటి సన్నీ లియోన్ ను అడల్ట్ కంటెంట్ ఉన్న కామెడీ మూవీస్ లో హీరోయిన్ గా చూసేందుకు ఇండియా జనాలు బాగా అలవాటు పడ్డారు.

ఆమెను ఓ పోర్న్ తారగా మాత్రమే కాకుండా.. ఓ హీరోయిన్ గా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే…నన్ను ఇండియా మొత్తం చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు, కానీ నా రక్త సంబంధీకులు మాత్రం నన్ను ఒప్పుకోవడంలేదు అని ఆవేదన చెందుతుంది. దానికి కారణం ఆమె గతం…గతంలో ఆమె పోర్న్ స్టార్ కావడమే. ఇక కుటుంబంతో కలిసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అని సన్నీ కన్నీళ్ళు పెట్టుకుంది. ఏది ఏమైనా…అందాల అప్సరసల్లా కనిపించే ప్రతీ తార వెనుక ఇలాంటి ధీన గాదలు ఎన్నో ఉంటాయి అని మరోసారి బయటపడింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus