Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ్ ఆంటోనీ (Hero)
  • ప్రీతీ అశ్రాని (Heroine)
  • భగవతి పెరుమాళ్, వెట్టై ముత్తుకుమార్, అరువి మధన్, శ్రీజ రావి, ప్రవీణ, హరిప్రియ ఇసై తదితరులు (Cast)
  • ఎం యు మారన్ (Director)
  • ఫాతిమా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి (Producer)
  • విజయ్ ఆంటోనీ (Music)
  • రాజీవ్ రాజేంద్రన్ (Cinematography)
  • విజయ్ ఆంటోనీ (Editor)
  • Release Date : 27th నవంబర్ 2026
  • సర్వంత్ రామ్ క్రియేషన్స్ & విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ (Banner)

విజయ్ ఆంటోనీ.. ‘బిచ్చగాడు’ నుండీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాల్లో బిచ్చగాడు రేంజ్లో ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. ప్రతి 2,3 నెలలకి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు విజయ్ ఆంటోనీ. ఇప్పుడు ‘నాన్న కుట్టీ’ (Nanna Kutty) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అయినా అతనికి బిచ్చగాడు రేంజ్ సక్సెస్ అందించిందో లేదో తెలుసుకుందాం రండి:

Nanna Kutty Movie Review

కథ: సూర్య (Vijay Antony) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్యాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. కూతురు దియా అంటే అతనికి ప్రాణం. సింగిల్ పేరెంట్‌గా కూతురితో కలిసి సంతోషంగా జీవిస్తున్న సూర్యను చూసి అనిత (Preethi Asrani) ఇష్టపడుతుంది. దియా చదువుకునే స్కూల్‌లోనే ఆమె టీచర్‌గా పనిచేస్తుంటుంది. అనితకు కూడా దియా అంటే ఎంతో ప్రేమ. ఆ పాప కోసమే సూర్యను పెళ్లి చేసుకోవడానికి సైతం సిద్ధపడుతుంది. కానీ సూర్య మాత్రం అనిత ప్రేమను అంగీకరించడు. అయినా ఆమె వెంటపడుతుండటంతో దియాను ఆ స్కూల్ మాన్పించాలనుకుంటాడు.

సరిగ్గా అదే సమయంలో దియా స్పృహ తప్పి పడిపోతుంది. ఆసుపత్రిలో చేర్పించగా, పాపకు ‘సివియర్ అప్లాస్టిక్ అనీమియా’ (Severe Aplastic Anemia) అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తిస్తారు. ఈ వ్యాధి నయం కావాలంటే తోబుట్టువుల (సిబ్లింగ్స్) నుండి, ముఖ్యంగా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి సేకరించిన స్టెమ్ సెల్స్‌తో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని సూచిస్తారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్య ఏం చేశాడు? అసలు సూర్య భార్య ఏమైంది? అతని గతం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేశాడు. యాక్షన్ సీన్, ఎమోషనల్ సీన్, కామిడీ సీన్.. ఇలా ఏది తీసుకున్నా అతనిలో మరో ఎక్స్ప్రెషన్ మచ్చుకైనా కనిపించదు.ప్రీతీ అస్రాని ఈ సినిమాలో చూడటానికి చాలా బాగుంది.

స్కిన్ షోకి దూరంగా చీరల్లోనే చాలా అందంగా కనిపించింది. నటిగా కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఇటీవల జైలర్ 2 లో అలరించిన భగవతి పెరుమాళ్ ఈ సినిమాలో కూడా విలక్షణ పాత్రలో మెప్పించాడు. మిగతా నటీనటుల పాత్రలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు.

సాంకేతిక నిపుణుల పనితీరు: పూణేలో జరిగిన ఓ యథార్థ సంఘటనను ఆధారం చేసుకుని దర్శకుడు ము.మారన్ ఈ కథను రాసుకున్నాడట. పాయింట్ పరంగా బాగానే ఉంది. కానీ ఎంత మంచి పాయింట్ ఎత్తుకున్నా, దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోతే ఆ కథకు తగిన న్యాయం జరగదు. ‘నాన్న కుట్టీ’ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు అసలు కథే మొదలవ్వదు. అప్పటివరకు రెండు సీన్లే రిపీటెడ్‌గా వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఇంటర్వెల్ వద్ద ఒక ట్విస్ట్ ఉంటుంది కానీ, అది కూడా పెద్దగా కిక్ ఇవ్వదు, ఎక్సైట్ చేయదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే కొంచెం బెటర్. స్టార్టింగ్ పోర్షన్ బాగానే ఉంటుంది. కానీ క్లైమాక్స్‌లో అనవసరమైన కోర్ట్ డ్రామాను ఇరికించి దర్శకుడు విసిగించాడు. హీరోయిన్ ట్రాక్ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. హీరో ఫ్రెండ్ రోల్‌తో చెప్పించిన కామెడీ డైలాగులు కూడా ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. మ్యూజిక్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. నిర్మాణ విలువలు చూస్తుంటే ఏదో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు మాత్రమే ఉండటం ఒక్కటే ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

విశ్లేషణ: ‘నాన్న కుట్టీ’ ఒక మంచి పాయింట్‌తో తెరకెక్కినప్పటికీ, ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేకపోయింది. ‘హాయ్ నాన్న’ టెంప్లేట్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కిక్ ఇవ్వదు.

ఫోకస్ పాయింట్: బోరింగ్ ఎమోషనల్ డ్రామా

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus