ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని హీరోలలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఒకరు. రాజశేఖర్ సినిమాలకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ మూవీకి మాత్రం ఊహించని స్థాయిలో ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంగీరిస్తే పాతిక కోట్ల రూపాయలు ఇస్తామని ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ మేకర్స్ కు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
ఇతర ఓటీటీ సంస్థలు కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ మేకర్స్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారో లేక ఓటీటీ ఆఫర్ పై ఆసక్తి చూపుతారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే రిలీజైన శేఖర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన జోసెఫ్ సినిమాకు ఈ సినిమా రీమేక్ కావడంతో ఓటీటీ సంస్థలు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నాయి. మేకర్స్ ఈ సినిమాను ఓటీటీకి ఇస్తే మాత్రం భారీగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది.
శేఖర్ మూవీ జానర్ కూడా ఓటీటీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఎంతగానో నచ్చుతుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా జీవితా రాజశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉందని సమాచారం. ఈ సినిమాకు వస్తున్న ఓటీటీ ఆఫర్లను చూసి రాజశేఖర్ కు ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో క్రేజ్ ఉందా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.