Icon Movie: ఐకాన్ మొదలయ్యేది ఎప్పుడంటే

Advertisement

ఐకాన్ కథను దర్శకుడు వేణు శ్రీరామ్ ఏ క్షణాన రాసుకున్నాడో గాని అతన్ని ఆ స్క్రిప్ట్ మాత్రం చాలానే ఊరిస్తోంది. అసలు సినిమా సెట్స్ పైకి వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో నిర్మాత దిల్ రాజు మొత్తానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. తప్పకుండా సినిమా ఉంటుందని ఆగిపోలేదని వకీల్ సాబ్ ప్రమోషన్ లోనే కుండబద్దలు కొట్టేశాడు. ఇక సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపిస్తాడని టాక్ అయితే వస్తోంది. ముఖ్యంగా కళ్లు కనిపించని అంధుడిగా కూడా నటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల అనేక రకాల కథనాలు వచ్చాయి. ఈ కథపై బన్నీ అయితే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాను ఆలస్యం చేయకుండా నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 పనులన్నీ అయిపోగానే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఐకాన్ సెట్స్ పైకి రానుంది.

ఇక ఆ సినిమా అయిపోగానే మళ్ళీ పుష్ప 2కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వనున్నాడు. ఐకాన్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. మరోవైపు పుష్ప పార్ట్ 1కు సంబంధించిన ఫస్ట్ పాటను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయవచ్చని సమాచారం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus