Kalyan Ram, Vijay Sethupathi: ఇది కదా క్రేజీ మల్టీస్టారర్ అంటే.. నిజమైతే సూపర్ హిట్ గ్యారెంటీ ..!

Advertisement

ఒకరేమో టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ … మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మరొకరేమో.. అన్ని భాషల్లోనూ విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేస్తున్నారు. వాళ్ళే కళ్యాణ్ రామ్, విజయ్ సేతుపతి. వీరిద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటి అంటే.. ఇమేజ్ పెంచుకోవాలి, మార్కెట్ పెంచుకోవాలి అని సినిమాలు చేసే రకం కాదు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు. కళ్యాణ్ రామ్.. అయితే ఇప్పటి వరకు ఎంతోమంది దర్శకులను పరిచయం చేశారు.

వాళ్లలో సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, మల్లిడి వశిష్ట్ వంటి వారు ఉన్నారు. వీళ్ళు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లుగా ఎదిగారు. ఇక విజయ్ సేతుపతి కూడా దాదాపు ఇంతే. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి పాత్రలు పోషించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా వస్తే ఎలా ఉంటుంది. క్రేజీగా ఉంటుంది కదా.

అసలు ఊహకే అందని ఈ కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన ఏ దర్శకుడికి తట్టింది అనే డౌట్ మీకు రావచ్చు. ‘దయా’ అనే వెబ్ సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ సాదినేని అందరికీ గుర్తుండే ఉంటాడు. అతను త్వరలో కళ్యాణ్ రామ్ – విజయ్ సేతుపతి..లతో ఓ క్రేజీ మల్టీస్టారర్ ను రూపొందించనున్నాడు అని సమాచారం. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus