మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 11 న విడుదల కాబోతుందని సమాచారం. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ తన 27 వ సినిమాని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనేదాని పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ (బుజ్జి) పేరు ఎక్కువగా వినిపించింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా మహేష్ సినిమా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ఇది ‘పాన్ ఇండియా’ కథ అని కూడా ప్రచారం జరిగింది.
అయితే తరువాత ఈ వార్త పై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఇది కూడా రూమరే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా ఫిక్స్ అని అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. మహేష కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుని ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. అందుకు కొత్త లుక్ కూడా ట్రై చేయబోతున్నాడట. ఇక ఆ మూడు నెలల గ్యాప్ లో ప్రశాంత్ నీల్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉంటాడని టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ అధినేత అనిల్ సుంకర నిర్మించబోతున్నాడని తెలుస్తుంది.