నిఖిల్ – సుధీర్ కాంబో గురించి, వాళ్లు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘స్వామి రా రా’, ‘కేశవ’ లాంటి విభిన్నమైన సినిమాలు వారి నుంచి వచ్చాయి. ఈ రెండు విజయాల తర్వాత మరోసారి ఈ కాంబో సిద్ధమవుతోంది. చాలా రోజుల నుంచి చర్చల దశలో, ప్రీప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమవుతోందట. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా లండన్‌లోనే ఉండబోతోందని తెలుస్తోంది.
‘స్వామి రా రా’ తర్వాత నిఖిల్ విజయాల బాటలోకి వస్తే, సుధీర్ వర్మ లాంటి మంచి దర్శకుడు టాలీవుడ్‌కి దొరికాడు. అయితే ఆ తర్వాత అంతగా సుధీర్ వర్మ మార్క్ తన సినిమాల్లో కనిపించలేదు. అయితే కొడితే గట్టిగా కొట్టాలనే లక్ష్యంతో సుధీర్ వర్మ – నిఖిల్ రెడీ అయ్యారట. కొత్త రైటర్ ఇచ్చిన కథతో సుధీర్ వర్మ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడట. ఫారిన్ బ్యాక్‌డ్రాప్ అవసరమవడంతో సినిమాను లండన్‌లోనే తీస్తారట. మెయిన్ పోర్షన్ అంతా అక్కడే షూట్ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం నిఖిల్ సూర్య ప్రతాప్ డైరక్షన్లో ‘18 పేజీస్’ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’లో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘మిడ్నైట్ రూమర్స్’ అనే కొరియన్ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఇవన్నీ అయ్యాకే సుధీర్ వర్మ సినిమా స్టార్ట్ చేస్తారట. అంటే అటుఇటుగా ఓ ఏడెనిమిది నెలలు పడుతుందట. ఈలోగా బ్రిటన్‌లో కరోనా పరిస్థితులు నార్మల్ అయిపోతాయనుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అక్కడే తీయాలి కదా.