“ఏమాయ చేసావే” చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత ఆ తర్వాత ఏస్థాయికి ఎదిగింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సమంతను తెలుగు తెరకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్ పర్సనల్ ఇంట్రెస్ట్ తో సమంతను అదే సినిమా హిందీ రీమేక్ “ఏక్ దివానా తా”లో చిన్న క్యారెక్టర్ తో బాలీవుడ్ కి పరిచయం చేసాడు. అయితే.. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత సమంత మళ్ళీ బాలీవుడ్ కు వెళ్లాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు.
అందుకు కారణం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతుండడమే. అయితే.. ఇప్పుడు పెళ్లయ్యాక సినిమాల సంఖ్యను బాగా తగ్గించడంతో, తనకి బాలీవుడ్ ఇప్పుడు కరెక్ట్ అని భావించింది సమంత. అందుకే మొదటిగా ప్రేక్షకుల ఆదరణను విశేషంగా చూరగొన్న “ది ఫ్యామిలీ మ్యాన్” సెకండ్ సీజన్ ద్వారా బాలీవుడ్ ను పలకరించనుంది సమంత. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఈ సిరీస్ ఆమెకు బాలీవుడ్ కు చక్కని బాట వేస్తోందని నమ్మకం వ్యక్తం చేస్తోంది సామ్.
మరి ఆమె ఆకాంక్ష ఏ విధంగా నెరవేరుతుందో చూడాలి. ఇకపోతే.. ప్రస్తుతం సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి గోవా బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటోంది. మొన్నే ఈ ఇద్దరు మాల్దీవ్స్ వెళ్లొచ్చారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!