Tamannaah, Vijay: తమన్నా-విజయ్ పెళ్లికి లైన్ క్లియర్..ఎప్పుడంటే..!

సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగిన తమన్నా గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అడల్ట్ కంటెంట్ సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచింది ఈమె. అంతే కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమాయణం నడిపి, మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం అని అధికారికంగా కూడా ప్రకటించారు.

విజయ్ వర్మ అనే పేరు వింటే ఎవరబ్బా అతను అని అనుకోవచ్చు. కానీ న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎంసీఏ’ చిత్రం విలన్ అంటే మాత్రం అందరూ గుర్తు పడుతారు. ఇప్పుడు తమన్నా తో రిలేషన్ లో ఉన్న తర్వాత ఇంకా ఫేమస్ అయ్యాడు అనుకోండి అది వేరే విషయం. ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా తమన్నా ఇచ్చిన పలు ఇంటర్వూస్ లో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పుకుంటూ వచ్చింది.

కానీ తమన్నా ఇంట్లో , అలాగే విజయ్ వర్మ ఇంట్లో పెళ్లి గురించి ఈమధ్య తీవ్రమైన ఒత్తిడి మొదలైందట. అందుకే ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివర్లో కానీ, వచ్చే ఏడాది జనవరి మొదట్లో కానీ వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం లోనే నిశ్చితార్థం కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక తమన్నా ప్రస్తుతం ఆర్మనై 4 మరియు వేదా చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి పెళ్లి తర్వాత (Tamannaah) ఈమె సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతుందో లేదో చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus