అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా పేరొందిన దివంగత ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న అబ్బాయిగా ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. ‘అల్లరి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అప్పట్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అంత కాకపోయినా .. ఇంచుమించు అదే రూట్లో అతని ప్లస్ పాయింట్ అయిన కామెడీని ఆయుధంగా చేసుకుని మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాల పక్కనే ఇతని సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్లుగా నిలిచిన రోజులు ఉన్నాయి.
క్రిష్ వంటి ఎంతో మంది దర్శకులకు మొదటి ఛాన్స్ ఇచ్చింది మన అల్లరోడే. ఏడాదికి 8 సినిమాలు చేసి థియేటర్లు కళకళలాడేలా చెయ్యడమే కాదు… ఎంతో మంది చిన్న ఆర్టిస్ట్ లకు .. ఇతని సినిమాల వల్ల చేతినిండా పని దొరికేది. అయితే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ సినిమాలు ఎక్కువ రాలేదు. గతేడాది వచ్చిన ‘మహర్షి’ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు అల్లరి నరేష్. ఇదిలా ఉండగా… ఇతని భార్య విరూప ఇతని పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
‘నేను’ సినిమా అండర్ రేటెడ్ అనే విధంగా విరూప పేర్కొంటూ…ఈ సినిమా 2004 లో కంటే తర్వాతి కాలంలో రావాల్సింది… అని పేర్కొంది. ఇందులో నరేష్ అద్భుతంగా నటించాడు. 2004లో ఈ సినిమా రిలీజైతే నేను నరేష్ ను పెళ్లాడిన రెండు వారాల తర్వాత అంటే 2015లో ఈ సినిమా చూశానని చెప్పుకొచ్చింది. నా భర్త అద్భుతమైన నటుడు. నరేష్ సినిమాలు అప్పటి వరకూ ఆమె చూడలేదట. అదే మొదటి సినిమా ఆమె చూడటం అట. నిజంగా విడ్డూరంగా ఉంది కదూ…!