Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » విజయ్ దేవరకొండ అగ్రశ్రేణి హీరోగా ఎదుగుతాడు – అల్లు అరవింద్

విజయ్ దేవరకొండ అగ్రశ్రేణి హీరోగా ఎదుగుతాడు – అల్లు అరవింద్

  • August 13, 2018 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ అగ్రశ్రేణి హీరోగా ఎదుగుతాడు – అల్లు అరవింద్

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీత గోవిందం. పరశురాం (బుజ్జి) దర్శకుడు. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ ఘంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. గీత గోవిందం చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ బయటికి వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ చేతగానితనం వల్ల బయటికి వచ్చాయి. ఆ క్లిప్పింగ్స్ ని గుంటూరులో ఉన్న స్టూడెంట్స్ షేర్ చేశారు. ఈ రోజు 17 మంది స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్లీగా షేర్ చేస్తున్నామని అనుకున్నారు. తెలియక చేసినా తప్పు తప్పే. జరిగిన తప్పును విచారిస్తున్నాం. యాక్షన్ తీసుకుంటాం. వైజాగ్ లోని ఓ కాలేజ్ కి కూడా పోలీసులు వెళ్లారు. పరిస్థితి ఇదివరకు లాగా లేదు. విజయదేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు. ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకోవచ్చు. ఇండస్ట్రీ కూడా సిగ్గు పడాల్సిన విషయం. బయటికి వచ్చిన క్లిప్పింగ్స్ వల్ల నష్టం లేదు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ రాబోయే పెద్ద సినిమాల గురించే నా బాధంతా. చిన్న పొరపాటుకి మీరు మీ ఫ్యామిలీస్ బాధపడతాయని చెబుతున్నాను. నేను ఈ సినిమా చూశాను. మాకు ప్రత్యేకమైన కొలమానాలుంటాయి. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో మేము ఊహించుకోగలం. డైరెక్టర్ చాలా కావాల్సిన వాడు. ఆయన దీని తర్వాత కూడా మా బ్యానర్లో ఇంకో సినిమా చేయబోతున్నాడు. మా సంస్థ ద్వారా 3వ సినిమా చేయబోతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ లో నాకు వంద సినిమాలు కనిపిస్తున్నాయి. వర్సటైల్ నటుడు. అగ్రశ్రేణి హీరోల జాబితాలో నిల్చోబోతున్న నటుడు. రష్మిక కోసం మేం మూడు నెలలు ఆపేశాం. డైరెక్టర్ ఈమెనే కావాలి అంటే.. తప్పలేదు. తన క్యారెక్టర్ ని చించేసింది. విజయ్ దేవరకొండతో పోటీపడి నటించడమంటే మాములు విషయం కాదు. నాకు వైజాగ్ లో ఘంటా శ్రీనివాస్ కంటే ఆప్తుడు ఎవరూ లేరు. ఈ ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన లేకుండా ఫంక్షన్ చేయను. ఇక్కడికి రాని బన్నీ వాసు గురించి చెప్పాలి. మేము చెప్పిందంతా ఎగ్జిక్యూట్ చేసేది బన్ని వాసు. అతని తరపును చెబుతున్నాను. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జెమ్. మా కెమెరా మెన్ విజువల్ ఫీస్ట్ అందించాడు. గోపి సుందర్ మిలియన్ హిట్స్ అందించాడు. సౌత్ ఇండియాలో షార్ట్ టైంలో ఇంకేం ఇంకే కావాలి రికార్డ్ వ్యూస్ సంపాదించింది. అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

Allu Aravind

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. నేను వైజాగ్ లోకల్. ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది. పాటలు సూపర్ హిట్ చేశారు. విజయ్, రష్మిక ప్రాణం పోశారు. అరవింద్ గారు, బన్ని వాసుగారు నా టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

Parasuram

రష్మిక మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఆగస్ట్ 15న గీత గోవిందం రిలీజ్ అవుతోంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సినిమాను ఎంజాయ్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

Rashmika

మంత్రి ఘంటా శ్రినివాస రావు మాట్లాడుతూ… గీత గోవిందం ఫంక్షన్ వైజాగ్ లో పెట్టడం చాలా సంతోషం. వైజాగ్ లో ప్రీ రిలీజ్ పంక్షన్ పెడితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అరవింద్ గారికి నమ్మకం. సరైనోడు ఫంక్షన్ కూడా ఇక్కడే చేశారు. సక్సెస్ మీట్ కూడా ఇక్కడే పెట్టాలని కోరుతున్నాను. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి అని అరవింద్ గారిని అడిగితే… ఈ మధ్య వచ్చిన హీరోల్లో ఇంత వెర్సటైల్ ఆర్టిస్ట్ ని చూడలేదన్నారు రాబోయే 15 సంవత్సరాల్లో డిఫరెంట్ సినిమాలు ఆయన నుంచి వస్తాయన్నారు. డైరెక్టర్ కి హీరోయిన్ కి టెక్నీషియన్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. వైజాగ్ సినిమా హబ్ గా మారనుంది. వైజాగ్ లో షూటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైజాగ్ లో స్టూడియో పెట్టాలని అరవింద్ గారిని కోరుతున్నాను. బన్నీకి కూడా ఇంట్రస్ట్ ఉంది అన్నాడు. ప్రభుత్వం తరపున అన్నిరకాలుగా సహకరిస్తాం. అని అన్నారు.

Ganta Srinivasa Rao

విజయ్ దేవర కొండ మాట్లాడుతూ… గతంలో వైజాగ్ లో ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేశాను కుదరలేదు. ఈ సినిమా ఫంక్షన్ మాత్రం వైజాగ్ లోనే చేయాలని పట్టుపట్టాను. నాకు మీరు మాత్రం ప్రేమను అందిస్తూనే ఉన్నారు. పైరసీ వల్ల రెండు మూడు రోజుల నుంచి మూడ్ పోయింది. అరవింద్ గారు, బన్ని వాసు గారు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా… వెనకాల ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. మేము సినిమా చేయాలి గాని లింకులు తీసే పరిస్థితి రాకూడదు. చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. పైరసీ తో కిందికి లాగే బ్యాచ్ కి చెప్పాలనుకున్నది ఒక్కటే. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా. మీరు ఏమైనా చేయండి. నేను నా కేరీర్ మీద చాలా ఫోకస్ పెట్టాను. మా అడియెన్స్ ని, ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడతా. గీత గోవిందం ఆగస్ట్ 15న థియేటర్స్ లో వస్తోంది. నేను థియేటర్ కి వన్ ఇయర్ తర్వాత వస్తున్నా. నాకు ఈ సినిమా మీద గట్టిగా నమ్మకం ఉంది. థియేటర్ నవ్వులతో నిండిపోతుంది. బుజ్జి గారికి ఓ డైలాగ్ స్టైల్ ఉంది. నాకు కంటి సర్జరీ అయినా సరే… రిలీజ్ కు వారం రోజులే టైం ఉన్నా డబ్బింగ్ చెప్పాను. బుజ్జి గారు ఎంత కష్టపడ్డారో.. ఎన్ని రాత్రులు నిద్రలేకుండా ఉన్నారో నాకు. ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. రష్మిక ఈ రోల్ కి ఎంత హార్డ్ వర్క్ చేసిందో నాకు తెలుసు. అరివింద్ గారు, వాసు గారు… ఖర్చు ఎంతైనా పర్లేదు. థియేటర్ కు వెళ్లి చూసే వాళ్లు ఎంజాయ్ చేయాలని క్వాలిటీ కోసం రీ షూట్స్ చేయించేవారు. బన్నీ వాసు గారు ఈ ఫంక్షన్ కి రాలేకపోయారు. ప్రొడ్యూసర్ తాను నిర్మించిన సినిమా ఫంక్షన్ కు కూడా రాలేని పరిస్థితి లో ఉన్నాడు…. పైరసీ వల్ల. నేను ఎన్ని మాటలైనా పడతాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఆ ఎనర్జీ వస్తుంది. మీరు ఫుల్ ఎజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రా యూనివర్శిటీకి చాలా చాలా థాంక్స్. వైజాగ్ రావాలనుకున్న కోరిక తీరింది. అని అన్నారు.

Vijay Devarakonda

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Director Parasuram
  • #Geetha Govindam
  • #Geetha Govindam Movie
  • #Geetha Govindam Pre Release Function

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

6 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

6 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

15 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

9 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

10 hours ago
Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

12 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

13 hours ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version