Allu Aravind: పరోక్షంగా మహేష్ బాబు పై కామెంట్స్ చేసిన అల్లు అరవింద్..!

  • June 4, 2022 / 11:48 AM IST

గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. జులై 1న ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఎందుకనో ఈ చిత్రం ప్రమోషన్లు కాస్త ముందుగానే స్టార్ట్ చేశారు. ‘జీఏ2 పిక్చర్స్’, ‘యూవీ క్రియేష‌న్స్‌‌’ సంస్థల పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండీ టీజర్ మరియు ‘అందాల రాశీ మేకప్‌ వేసి.. నా కోసం వచ్చావే..’ అనే పాట ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ఓ ఈవెంట్ ను నిర్వహించారు. గోపీచంద్, రాశీ ఖన్నా,నిర్మాత బన్నీ వాస్, దర్శకుడు మారుతీ ఈ ఈవెంట్లో పాల్గొని స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అల్లు అరవింద్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాని థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. నిన్న బన్నీ విదేశాల్లో నుండి వస్తే ‘ఎఫ్3’ బాగుంది చూడు అన్నాను.

క్యూబ్ లో వేయించుకుని చూడమని చెబుతుంటాను కానీ బన్నీ మాత్రం కూకట్ పల్లి లో ఉన్న థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తుంటాడు. ముసుకు వేసుకుని సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్లి కూర్చుంటాడు. ఇంటర్వెల్ కు కొద్ది సేపు ముందు బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్లి చూస్తుంటాడు. థియేటర్లో జనాలతో కలిసి సినిమా చూడటాన్ని అతను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. గోపీచంద్ ఎక్కువగా సినిమా వేడుకలకి రాడు.

సిగ్గు ఎక్కువ అతనికి. అయితే ఈ సినిమాకి మాత్రం అతన్ని తీసుకొచ్చాను. సినిమాని మీ హీరోలే ప్రమోషన్ చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు వచ్చి చెబితే జనాలు థియేటర్ కు రారు. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో తన సినిమా రిలీజ్ అయ్యాక ఏర్పాటు చేసిన ప్రమోషన్ ఈవెంట్ లో స్టేజి ఎక్కి స్టెప్పులేశాడు. అతని సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. అలాగే అందరూ హీరోలు ఎవరి సినిమాని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే జనాలు థియేటర్ కు వస్తారు” అంటూ పరోక్షంగా మహేష్ బాబు గురించి కామెంట్స్ చేశారు అల్లు అరవింద్.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus