మహేష్ – సుకుమార్… పెద్ద రచ్చే…!

గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు… ఓ డైరెక్టర్ తో నేను సినిమా చేయడం లేదు అని ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. ఇక అదే రోజు అల్లు అర్జున్ తన 20 వ చిత్రాన్ని మహేష్ వదిలేసిన డైరెక్టర్ తో చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది… అయితే దానికి ఒక్క రోజు ముందు ఓ ఆసక్తికర విషయం జరిగిందట. ‘గీతా ఆర్ట్స్’ అధినేత అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్ నేరుగా మహేష్ భార్య నమ్రతను కలుసుకున్నారట. సుకమార్ చెప్పిన కథ మహేష్ కి ఎలాగూ నచ్చలేదు కాబట్టి… అదే కథని బన్నీతో ‘మైత్రీ మూవీస్ బ్యానర్ లో చేస్తామని అడిగారట.

దీనికి బదులుగా ‘గీతా ఆర్ట్స్’ లో మహేష్ తో ఓ చిత్రం చేస్తామని చెప్పారట అల్లు అరవింద్. అయితే అదేం లేదని, తాము సమాంతరంగా రెండు సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నమ్రత వివరించారట. నమ్రత ఇలా చెప్పడంతో… అరవింద్ ఇక మాట్లాడలేక వెనక్కు వచ్చేశారని తెలుస్తుంది. అయితే ఇది జరిగిన 24 గంటల్లోనే మహేష్ ఇలా రెస్పాండ్ అవుతారని, వ్యవహారం ఇలా టర్న్ తీసుకుంటుందని మైత్రీ మూవీస్ కానీ, సుకుమార్ కానీ అనుకోలేదట. ఇక మీడియా కూడా ఇలా రెస్పాండ్ అయ్యి.. ఇన్ని కథనాలు లేవనెత్తుతాయని అనుకోలేదట. ఇక ఈ వ్యవహారాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలీక సుకుమార్-మైత్రీ మూవీస్ వారు డిస్కషన్లు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus